Belly Fat Loss Drink: ప్రస్తుతం చాలామంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. దీనికి తోడు నడుము భాగంలో విపరీతంగా కొవ్వు పేరుకుపోయి ఉబ్బెత్తులా కనిపిస్తోంది. దీనివల్ల మనిషి అంద హీనంగా కనిపిస్తున్నాడు. అయితే చాలామంది మార్కెట్లో లభించే వివిధ రకాల పొట్ట తగ్గించే రసాయనాలతో కూడిన ఔషధాలను వినియోగిస్తున్నారు ఎన్ని ట్రై చేసినప్పటికీ ఖచ్చితమైన రిజల్ట్ ను పొందలేకపోతున్నారని వారు వాపోతున్నారు. నిజానికి బెల్లీ ఫ్యాట్ ఒక్కసారి పెరిగితే దానిని తగ్గించుకోవడం చాలా కష్టమని తెలిసినప్పటికీ చాలామంది వివిధ రకాల టిప్స్ వినియోగిస్తున్నారు. బెల్లీ ఫ్యాట్ రావడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కొంతమంది లోనైతే గుండెకు సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. అలాగే మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం బెల్లీ ఫ్యాట్ పెరగడం అనేది చాలామందిలో కామన్ అయినప్పటికీ.. కొన్ని అలవాట్ల వల్ల ఎక్కువగా పెరుగుతూ వస్తోంది. చాలామందిలో బెల్లీ ఫ్యాట్ జంక్ ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాలను అతిగా తినడం వల్ల వస్తోంది. కాబట్టి ఈ పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి తప్పకుండా ఇలాంటి ఆహారాలను మానుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు కొద్ది రోజులపాటు వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న కొన్ని చిట్కాలను వినియోగించి మరెన్నో సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఆయుర్వేద నిపుణులు తెలిపిన ఈ డ్రింక్స్ రోజు తాగితే ఫ్యాట్ తగ్గుతుంది. 


సబ్జా విత్తనాల వాటర్:
ప్రతిరోజు సబ్జా విత్తనాలతో తయారుచేసిన నీటిని తాగడం వల్ల సులభంగా శరీరంలోని పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చెడు కొవ్వును నిర్మూలించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అలాగే సబ్జా నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరం కూడా డీహైడ్రేషన్కు గురవకుండా ఉంటుంది.


డ్రింక్ ని ఇలా తయారు చేసుకోండి: 
ముందుగా ఈ సబ్జా గింజల నీటిని తయారు చేసుకోవడానికి.. కొన్ని సబ్జా గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇలా తీసుకున్న సబ్జా గింజలను ఖాళీ గ్లాసులో వేసుకొని అందులో తగినన్ని నీటిని పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోనే కావాలనుకుంటే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకొని, నిమ్మరసం, తేనె యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని తాగండి. ఇలా సబ్జా గింజల నీటిని తయారుచేసుకుని రోజు ఉదయం సాయంత్రం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు.


పొట్ట ఫ్లాట్: 
బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు సబ్జా గింజల వాటర్ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఈ వాటర్ లో జింజర్ రసాన్ని కూడా యాడ్ చేసుకుని తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకొని తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తొలగిపోవడమే కాకుండా శరీరంలోని ఎలాంటి కొవ్వు పరిమాణాలైనా తగ్గిపోతాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.