Weight Loss Tips: బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు ఇంగుల నీళ్ళని వారి డైట్ లో చేర్చుకోవాలి. ఎందుకంటే దీని తాగడం ద్వారా బరువు తొందరగా తగ్గవచ్చు. కాబట్టి బరువు తగ్గాలి అనుకమునే వారు ఈ ఇంగువ నీళ్ళను అలవాటు చేసుకోవడం మంచిది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మనం అనుసరిస్తున్న బిజీ లైఫ్ స్టైల్.. అనారోగ్యకర ఆహార పదార్థాలు వలన శరీరంలో కొవ్వు పేరుకుపోయి.. బరువు పెరుగుతున్నారు. బరువు పెరగటం వలన తీవ్ర ఇబ్బందులతో పాటు.. శరీరంలో ఇతరేతర అనారోగ్యాలు కూడా వాస్తుంటాయి. ముఖ్యంగా.. అధిక బరువు బలంగా మధుమేహం, హై బీపీ, గుండె పోటు వంటి భయంకర వ్యాధుల బారినపడే అవకాశాలు ఉన్నాయి. 


బరువు తగ్గాలి అంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వినియోగించబడాలి. దీనికోసం ఇతరేతర మందులు అవి కాకుండా రోజు వ్యాయామం చేయటం చాలా అవసరం. వీటితో పాటుగా తినే ఆహరం కూడా చాలా ముఖ్యం. మనం తినే ఆహారమే మన శరీర బరువును ఒక నియంత్రణలో ఉంచుతుంది. 


బరువు తగ్గటానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు మన ఇంట్లో ఉండే ఇంగువ గురించి ఆలోచించరు. అవును ఇంగువను ఉపయోగించి శరీర బరువు తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఇంగువ గురించి మన అందరికి తెలిసిందే. మన ఇళ్లలో ఇంగువని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటాము. ఇంగువని వంటల్లో ఉపయోగించడమే కాకుండా.. దీని ద్వారా బరువు కూడా తగ్గించుకోవచ్చు. ఇంగువ వల్ల బరువు తగ్గడమే కాదు..  మైగ్రేన్ సమస్యను కూడా తగ్గిపోతుంది. ఇంగువ నీళ్లను తాగడం ద్వారా బరువుని ఎలా తగ్గించుకోవాలో ఇపుడు మనం తెలుసుకుందాం!


Also Read: Revanth Reddy: మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం.. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ: రేవంత్ రెడ్డి  


బరువు తగ్గించడంలో ఇంగువ నీరు ఎంతో  ఉపయోగపడుతుంది. ఇంగువ నీటిని తాగడం ద్వారా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇంగువ నీటి వల్ల  జీవక్రియ మెరుగుపడుతుంది. కావున గోరువెచ్చని నీటిలో ఇంగువని  కలపి ఆ నీటిని తాగడం ద్వారా బరువుని తగ్గించుకోవచ్చు. 


ఇంగువ నీళ్ల వల్ల తగ్గే సమస్యలు  


- జీర్ణక్రియని బలపరచడంలో ఇంగువ నీళ్లు ఉపయోగపడతాయి. ఇంగువలో బరువుని తగ్గించే యాంటీ ఒబేసిటీ గుణాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంతో సహాయపడతాయి.  


-తలనొప్పి పలు రకాలుగా వస్తుంది. ఇలా వచ్చే ఎలాంటి తలనొప్పి అయిన తల నొప్పి సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇంగువ నీళ్ళని డైట్ లో చేర్చుకోవడం ఎంతో  లాభదాయకం.  


-నెలసరి నొప్పికి కూడా ఈ ఇంగువ నీళ్లు ఎంతో ఉపయోగకరం. పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎక్కువగా నొప్పి కలిగితే.. ఈ ఇంగువ  నీళ్లు తాగడం మంచిది.


Also Read: Vivo V29 Pro Price: అదిరిపోయే లుక్స్‌తో మార్కెట్‌లోకి Vivo V29, Vivo V29 Pro మోడల్స్..ధర, ఇతర పూర్తి వివరాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook