Vivo V29 Pro Price: అదిరిపోయే లుక్స్‌తో మార్కెట్‌లోకి Vivo V29, Vivo V29 Pro మోడల్స్..ధర, ఇతర పూర్తి వివరాలు..

Vivo V29 Pro Price: వివో నుంచి Vivo V29, Vivo V29 Pro మోడల్స్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌ విడుదలయ్యాయి. ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి అందుబాటులో వచ్చాయి. ఈ మొబైల్స్‌ సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2023, 04:21 PM IST
Vivo V29 Pro Price: అదిరిపోయే లుక్స్‌తో మార్కెట్‌లోకి Vivo V29, Vivo V29 Pro మోడల్స్..ధర, ఇతర పూర్తి వివరాలు..

 

Vivo V29 Pro Price: వివో నుంచి మరో రెండు స్మార్ట్‌ ఫోన్‌లు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. Vivo V29, Vivo V29 Pro మోడల్స్‌లో కంపెనీ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేశాయి. దీంతో పాటు ఈ మొబైల్‌ హిమాలయన్ బ్లూ, మెజెస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తోంది. ఈ రెండు ఫోన్‌లు 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఈ మొబైల్స్‌  స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌లు 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ ఫోన్‌లను రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. మొదటి వేరియంట్‌ 8 GB + 128 GB, రెండవది 12 GB + 256 GB 128GB కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ. 32,999 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక Vivo V29 Pro విషయానికొస్తే.. 8GB + 256GB స్టోరేజ్‌,  12GB + 256GB స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే..బేస్‌ వేరియంట్‌ రూ. 42,999కు లభిస్తోంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ప్రీ-ఆర్డర్ వివరాలు:
ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ ఈ రోజు నుంచి ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. Vivo V29 Pro మొబైల్‌ విక్రయాలు అక్టోబర్ 10న జరగనున్నాయి. ఇక V29 విక్రయాలు అక్టోబర్ 17 నుంచి అందుబాటులో రానున్నాయి. అంతేకాకుండా కంపెనీ వీటిని క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు ప్రకటించింది. 

Vivo V29, Vivo V29 Pro స్పెసిఫికేషన్‌లు:
మూడు కెమెరా లెన్స్‌ సెటప్‌
LED ఫ్లాష్ లైట్‌
3D డిజైన్‌తో హిమాలయన్ బ్లూ కలర్‌
120Hz రిఫ్రెష్ రేట్
6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
టైప్-సి ఛార్జింగ్ పోర్ట్
V29 Qualcomm Snapdragon 778G చిప్‌సెట్‌
4600 mAh బ్యాటరీ ప్యాకప్‌
80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌
ట్రిపుల్ కెమెరా సెటప్‌
50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
8 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ షూటర్
2 మెగాపిక్సెల్ బోకె లెన్స్‌

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News