Pachi Sanaga Bajji Recipe: పచ్చి శనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్‌తో పాటు కాల్షియం అధిర పరిమాణంలో లభిస్తాయి. అలాగే ఇందులో యాంటీఆక్సిడెంట్లతో కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్‌లో తప్పకుండా చేర్చుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. చాలా మంది పచ్చి శనగలను ఉడకబెట్టుకుని తింటూ ఉంటారు. అయితే మరికొంతమందైతే వీటిని బజ్జీలు లేదా అప్పాల్లా కూడా తయారు చేసుకుంటారు. అలాగే ఈ పచ్చి శనగలతో బజ్జీలను కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో ఎలా బజ్జీలను వేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చి శనగ బజ్జీల రెసిపీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు పచ్చి శనగలు
1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు
1/4 కప్పు కొత్తిమీర ముక్కలు
1/2 అంగుళం అల్లం తురుము
1/2 ఎర్ర మిరపకాయలు, చిన్న ముక్కలుగా కోసినవి
1/2 టీస్పూన్ జీలకర్ర
1/4 టీస్పూన్ పసుపు
1/4 టీస్పూన్ ఉప్పు
నూనె వేయడానికి
1/2 టీస్పూన్ సోంపు
1/4 టీస్పూన్ కారం
1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము


తయారీ విధానం:
ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి పచ్చి శనగలను రాత్రంతా నానబెట్టుకోండి.
ఉదయం, శనగలను నీటిలో వేసి ఉడికించాల్సి ఉంటుంది.
శనగలు ఉడికిన తర్వాత, వాటిని నీటి నుంచి తీసి, చల్లబడేంతవరకు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఒక గిన్నెలో, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ముక్కలు, అల్లం తురుము, ఎర్ర మిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
వీటన్నింటిని బాగా మిక్స్‌ చేసుకుని పిండి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇందులోనే సోంపు, కారం వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత పాన్‌లో నూనెను పోసుకుని బాగా వేడి చేసి ఈ మిశ్రమాన్ని బజ్జీలా వేసుకోవాల్సి ఉంటుంది. 
శనగ బజ్జీలు రంగు మారేంత వరకు వేయించుకుని బయటకు బయటకు తీసి సర్వ్‌ చేసుకుంటే చాలు.


చిట్కాలు:
శనగ బజ్జీలకు మరింత రుచి రావాలంటే, మీరు వాటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా కలుపుకోవచ్చు.
శనగ బజ్జీలను మరింత క్రిస్పీగా రావాలంటే, మీరు వాటిని స్లోవ్‌గా డీప్ ఫ్రై చేయండి.
శనగ బజ్జీలను చట్నీ లేదా సాస్‌తో కలిపి తీసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పొందుతారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి