Palu Kobbari Payasam: పాలు, కొబ్బరితో పాయసం.. తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది !
Palu Kobbari Payasam Recipe: పాయసంను మనం ఎక్కువగా ఏదైనా శుభవార్త విన్నప్పుడు, పెళ్లి, పుట్టిన రోజు ఇలా శుభ సందర్భంలో తయారు చేసుకుంటాము. అయితే తరుచుగా చేసుకొనే పాయసం కన్నా ఈ కొబ్బరి పాలు పాయసం ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని తినడం వల్ల సీజన్ల్ జబ్బలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
Palu Kobbari Payasam recipe: పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఈ కొబ్బరితో రుచికరమైన పాయసం తయారు చేసుకోవచ్చు. పాయసం అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎగిరి గంతేస్తారు. అయితే తరుచుగా చేసుకొనే పాయసం కంటే ఈ కొబ్బరి పాయసం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిని మీరు ఎంతో సింపుల్‌గా తయారు చేసుకొని తినవచ్చు. ఒక్కసారి ఈ కొబ్బరి పాయసం తిన్న తరువాత మళ్లీ మళ్లీ తినాలని అడుగుతారు. ఈ పాయసం శీతాకాలంలో తయారు చేసుకొని తినడం వల్ల మన ఇమ్యునిటీ లెవెల్స్ పెరుగుతాయని చెబుతున్నారు. దీని వల్ల సీజన్ల్ జబ్బులకు చెక్ పెట్టవచ్చు. అయితే టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పాయసం ఎలా తయారు చేసుకోవాలి.
పాలు కొబ్బరి పాయసంకి కావాల్సిన పదార్థాలు:
ఒక కప్పు కొబ్బరి తురుము
3/4 కప్పు చక్కెర
1/2 కప్పు పాలు
రెండు టేబుల్ స్పూన్ బియ్యం
1/2 టీస్పూన్ యాలకుల పొడి
నెయ్యి
బాదం పప్పు
పాలు, కొబ్బరి పాయసం తయారు చేసే విధానం:
ముందుగా రెండు గంటలపాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తరువాత ఇందులోకి కొబ్బరి తురుము వేసి మెత్తగా కలుపుకోవాలి. ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని మొత్తం తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన ఈ మిశ్రమంలో షుగర్ , పాలు పోసి బాగా కలపాలి. పాయసం చిక్కబడుతున్నప్పుడు యాలకుల పొడి, నేతిలో వేయించిన బాదం పప్పు వేసి దింపుకోవాలి. ఇలా ఎంతో రుచికరమైన పాయసం రెడీ. మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే వీటిని కూడా ఇందులో కలుపుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ నేరుగా తీసుకోవడం ఇష్టం లేని వారు ఈ విధంగా తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మీరు కూడా ఈ డిష్‌ని తయారు చేసుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందుతారు.
Also read: Gobi Paratha: అదిరిపోయే ధాబా స్టైల్ గోబీ పరాటా.. కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook