Gobi Paratha: అదిరిపోయే ధాబా స్టైల్‌ గోబీ పరాటా.. కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా!

Gobi Paratha Recipe: గోబీ పరాఠా అనేది మసాలా కాలీఫ్లవర్ సగ్గుబియ్యంతో కూడిన ఉత్తర భారత హోల్ వీట్ ఫ్లాట్ బ్రెడ్‌లు. గోబీ అనేది కాలీఫ్లవర్‌కి హిందీలో ఇలా పిలుస్తారు. ఈ పరాఠాను బ్రేక్‌ ఫాస్ట్‌గా తినవచ్చు. దీనిని రైతా, చట్నీ లేదా ఊరగాయతో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 09:03 PM IST
Gobi Paratha: అదిరిపోయే ధాబా స్టైల్‌ గోబీ పరాటా.. కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా!

Gobi Paratha Recipe: మనం బయటకు వెళ్లినప్పుడు ధాబా స్టైల్‌ ఫుడ్‌ని తినాలి అనిపిస్తుంది. కానీ బయట ఫూడ్‌ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లోనే ఆ ఫూడ్‌ని చేసుకొని తినడం వల్ల ఎలాంటి సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు. అయితే  ధాబా స్టైల్ ఫుడ్ ఎంతో రుచికరమైన  గోబీ పరాటా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం తరుచు చేసుకొనే చపాతీలా దీనిని కూడా ఎంతో సులభంగా చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. దీనిని చిన్నపిల్లలు , పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.

గోబీ పరాటాకు కావాల్సిన పదార్థాలు:

100 గ్రాములు- తురిమిన క్యాలీ ఫ్లవర్

ఒక కప్పు- గోధుమ పిండి 

ఉప్పు 

బటర్

మూడు- వెల్లుల్లి రెబ్బలు

అర టీ స్పూన్-కారం

అర టీ స్పూన్ -  చాట్ మసాలా

 పచ్చిమిర్చి 

అల్లం తరుగు

నిమ్మరసం 

గోబీ పరాటా తయారు చేయడం ఎలా: 

ముందుగా కాలీఫ్లవర్ నీటితో  శుభ్రం చేసి ముక్కులుగా తరిగి పక్కకి తీసుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని అందులోకి ఉప్పు, నెయ్యి, వేసుకుని బాగా కలపాలి.
ఆ తర్వాత నీటిని వేస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకోవాలి. ముందుగా తీసుకున్న క్యాలీ ఫ్లవర్ లోకి మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని కలుపుకోవాలి.

చపాతీ ఉండను తీసుకుంటూ ముందుగా ఇందులో కొద్దిగా క్యాలీ ఫ్లవర్ మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసి వేయాలి. వీటిని చపాతీ కర్రతో చపాతీలా రుద్దుకోవాలి. తర్వాత బటర్‌ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా రుచికరమైన గోబీ పరోటాలు సిద్ధం అవుతుంది. ఇందులో ఆవకాయ, రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఈ గోబీ పరోటాలను తయారు చేసుకొని తినడం వల్ల ధాబా ఫుడ్‌ మిస్ అవుతూన అనుభవం పోతుంది. 

Also read: Nails Tips: గోళ్లు పెంచుతున్నారా ? అయితే ఈ షాకింగ్‌ న్యూస్‌ మీకు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News