Pandu Mirapakaya Pachadi Recipe In Telugu: పచ్చడి లేని భోజనం అసంపూర్ణంగా భావిస్తారు. పూర్వకాలం నుంచి ఆహారాల్లో తినడం ఆనవాయితీగా వస్తోంది.. చాలామంది పచ్చళ్ళతోనే ఎక్కువగా అన్నాన్ని తింటూ ఉంటారు. ఇవి కూరలకు రుచిని జోడించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలామంది పప్పన్నం తినే క్రమంలో పచ్చళ్లను అదనంగా తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రజలు చపాతీలను తినే క్రమంలో కూడా పచ్చళ్ళను వినియోగిస్తారు. ముఖ్యంగా తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో నైతే తప్పకుండా రాత్రి సాయంత్రం పూట తీసుకునే భోజనంలో భాగంగా పచ్చళ్లను తింటూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామందికి పచ్చళ్ళు అంటే ముందుగా గుర్తుకొచ్చేది పండుమిరపకాయ పచ్చడి. ఈ పచ్చడి పురాతన కాలం నుంచి వస్తున్న రెసిపీ. పప్పు పండుమిరపకాయ పచ్చడి కాంబినేషన్ వేరు. వీటి రెండింటినీ కలుపుకొని అదనంగా నెయ్యి జోడించుకుని తింటే ఆ రుచే వేరు. అయితే ప్రస్తుతం చాలామంది ఈ పండు మిరపకాయ పచ్చడి మార్కెట్లో లభించే వివిధ రకాల షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా కొనుగోలు చేసిన పచ్చళ్లను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని తినడం ఎంతో మేలు. అయితే చాలామంది ఈ పచ్చడిని ఇంట్లో తయారు చేయడం ఎంతో కష్టమని అనుకుంటారు. కానీ దీనిని తయారు చేయడం చాలా సులభం. దీని తయారీ విధానం ఏంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.


పండు మిరపకాయ పచ్చడి రెసిపి (Pandu Mirapakaya Pachadi Recipe)
కావలసిన పదార్థాలు (Ingredients):

✾ 1 కేజీ ఎండుమిరపకాయలు (Dry Red Chillies)
✾ 200 గ్రాములు పుల్లని చింతపండు (Seedless Tamarind)
✾ 250 గ్రాములు నాటు సైంధవ లవణం (Rock Salt)
✾ ¼ కప్పు వెల్లుల్లి రెబ్బలు (Garlic Cloves)
✾ 2 టీస్పూన్లు ఆవాలు (Mustard Seeds)
✾ 2 టీస్పూన్లు మెంతులు (Fenugreek Seeds)
✾ ఆవపిండి - కలుపుకోవడానికి సరిపడా 
✾ పల్లి నూనె (Oil)


తయారీ విధానం:
✾ ముందుగా బౌల్లో నీటిని పోసుకొని అందులో ఎండుమిరపకాయలను శుభ్రంగా కడగాలి. అలాగే ఇదే సమయంలో కాండాలు తీసివేసి, లోపల గింజలుంటే తీసేయాలి.
✾ తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రం చేసిన ఎండుమిరపకాయలను వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
✾ పుల్లని చింతపండును కొంచెం వేడి నీటిలో నానబెట్టి, గుజ్జుగా చేసి పులుసు వేరు చేసుకోవాలి.
✾ అలాగే ఇదే సమయంలో వెల్లుల్లి రెబ్బలను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
✾ ఇప్పుడు పెద్ద బాండీ తీసుకుని, పొడి చేసిన మిరప పొడి, చింతపండు పులుసు, నాటు సైంధవ లవణం వేసి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది.
✾ ఆ తర్వాత కొంచెం కొంచెం ఆవపిండి వేస్తూ బాగా కలపాల్సి ఉంటుంది. ఈ మిశ్రమం గట్టి పడేంత వరకు కలుపుతూనే ఉండాలి.


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
✾ ఆ తర్వాత మరో పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులో పల్లి నూనె పోసుకొని బాగా వేడి చేయాలి.
✾ నూనె కాగిన తర్వాత, ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
✾ వేయించిన ఆవాలు, మెంతులు, వెల్లుల్లి ముక్కలు పచ్చడిలో వేసి కలపాలి.
✾ పచ్చడి చల్లారాక, ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ ఉంచవచ్చు. అవసరమైనప్పుడు పెరుగన్నంలోకి కలుపుకొని తింటే భలే ఉంటుంది.


ఈ చిట్కాలు తప్పనిసరి (Tips):
✾ పండు మిరపకాయ పచ్చడి కోసం తప్పకుండా ఎండుమిరపకాయలను బాగా ఎండినవి వాడాలి.
✾ మీరు పచ్చడి ఎక్కువ కారంగా ఉండాలంటే, మిరప పొడి ఎక్కువ వేసుకోవచ్చు.
✾ పచ్చడిను ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉంటే, పులుపు పట్టకుండా ఉంటుంది.


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter