Periods Pain: పీరియడ్స్‌కు ముందు ఇలాంటి లక్షణాలు వస్తున్నాయా.. జాగ్రత్తలు తప్పనిసరి..
Periods Pain: కొంతమందికి పీరియడ్స్‌కు ముందు మూడ్ స్వింగ్స్, మరికొంత మందిలో డయేరియా వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
Periods Pain: స్త్రీల జీవితంలో అతి కష్టమైన రోజూలు పీరియడ్స్ సమయాలు. అందరికీ తెలిసిందే ఈ సమయంలో మహిళలు ఎలా ఉంటారో. అయితే ప్రతి నెలా పీరియడ్స్ రాకముందే మహిళల్లో వివిధ రకాల సంకేతాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది మూడ్ స్వింగ్‌లను ఎదుర్కొంటే కొంత మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇంకొందరిలో గ్యాస్, ఉబ్బరం, తిమ్మిర్లు వంటి లక్షణాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇటివలే పలు నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలు పీరియడ్స్‌కు ముందు లూజ్ మోషన్ వంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడతారు. అయితే ఇలాంటి అనారోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణాలేంటో, ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రతయ్నాలు చేద్దాం..
లూజ్ మోషన్‌కు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం:
పీరియడ్స్ సమయంలో చాలా మంది లూజ్ మోషన్ సమస్యలతో బాధపడతారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం కొన్ని కారణాల వల్లే జరగొచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హార్మోన్ మార్పులు:
ఋతు చక్రం సమయంలో హార్మోన్ స్థాయిలు మారుతాయి. అంతేకాకుండా శరీరంలో కూడా మార్పలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి కొంతమంది మహిళలు ఈ హార్మోన్ల మార్పులకు ఎక్కువ సున్నితంగా ఉంటారు.
మెదడులో రసాయన మార్పులు:
రక్తంలో సెరోటోనిన్, GABA వంటి న్యూరోట్రాన్స్మిటర్లు వివిధ రసాయన పదార్ధాల స్థాయిలలో హెచ్చుతగ్గులుగా గురవుతుంది. దీని కారణంగా చాలా రకాల మార్పులు సంభవించి వివిధ రకాల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలున్నాయి.
నిరాశ, ఆందోళన:
ప్రస్తుతం చాలా మందిలో పీరియడ్స్ సమయంలో డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి లక్షణాలు రావడానికి ప్రధాన కారణాలు పలు రకాల మార్పులేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి