Poppy Seeds Uses: గసగసాలు చేసే మేలు ఏంటో మీకు తెలుసా?
Poppy Seeds Benefits: వంటల్లో గసగసాలను ఎక్కువగా ఉపయోగిస్తాము. అయితే ఇది కేవలం వంటలకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతంది. దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Poppy Seeds Benefits: గసగసాలను మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగిస్తాము. వీటిని ఇండియన్ గసగసాలు అని కూడా పిలుస్తారు. ఇవి చూడడానికి చిన్నగా కనిపించిన ఎన్నో లాభాలు కలిగి ఉంటాయి. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
గసగసాలులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ బి6,ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయి. గసగసాలు గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతాయి. ఇందులో ఉండే ఒమెగా-6 చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అంతేకాకుండా డయాబెటిస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ గసగసాలను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఈ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.
నేటికాలంలో చాలా మంది కీళ్ల నొప్పి, నడుము నొప్పి, శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ గసగసాలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే కాల్షియం , మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు కూడా తగ్గుతాయి. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గసగసాల ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
గసగసాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెలటోనిన్‌గా మారుతుంది నిద్రను నియంత్రించే హార్మోన్ నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. గసగసాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి
సహాయపడుతుంది. గసగసాల నూనె చర్మాన్ని తేమగా ఉంచడానికి మొటిమలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. గసగసాలలో నొప్పిని నివారించే లక్షణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ , వాపు వంటి నొప్పితో కూడిన పరిస్థితులకు చికిత్స చేయడంలో సహాయపడతాయి.
గసగసాలలో బయోయాక్టివ్ పదార్థాలు ,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. బలమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల జ్వరం, చలి, గొంతు నొప్పి ,ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో సహాయపడుతుంది.
గమనిక:
గసగసాల అలెర్జీ ఉన్నవారు వాటిని తినకూడదు. గర్భవతి లేదా పాలిచ్చే మహిళలు గసగసాలను తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి