White Hair To Black Naturally Permanent: జుట్టు మెలనిన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది జుట్టు రంగును మార్చే స్వభావం కూడా కలిగి ఉంటుంది. వయస్సు పెరిగేకొద్దీ హెయిర్ ఫోలికల్స్ తక్కువ మెలనిన్ ఉత్పత్తి చేస్తాయి. దీని కారణంగా తెల్ల జుట్టు ఇతర జుట్టు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చిన్న వయసులోనే దీని ఉత్పత్తి శాతం తగ్గుతోంది. దీని కారణంగా చాలామంది తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. కొంతమందిలో జన్యుపరమైన కారణాలు ఒత్తిడి పోషకాహార లోపం వంటి కారణాలతో ఇలాంటి సమస్య బారిన పడితే.. మరికొందరిలో ఆధునిక జీవనశైలి కారణంగా కూడా తెల్ల జుట్టు వస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీకు కూడా క్రమంగా తెల్ల జుట్టు పెరిగితే తప్పకుండా ఈ కింది చిట్కాలను పాటించండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీని ఆహారంలో తీసుకుంటే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది:
ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికే కాకుండా జుట్టుకు చాలా మంచిది. కాబట్టి తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఈ ఆహారాలు తప్పనిసరి..


మష్రూమ్:
మష్రూమ్స్ మన శరీరానికే కాకుండా జుట్టుకు కూడా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ డి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్య నుంచి విముక్తి లభిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో జుట్టును దృఢంగా చేసి చాలా రకాల మూలకాలు లభిస్తాయి.


Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  


డార్క్ చాక్లెట్ :


ఒత్తిడిని తగ్గించేందుకు డార్క్ చాక్లెట్ కీలక పాత్ర పోషిస్తుంది. తెలిసినవారు చాలామంది వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. అంతేకాకుండా డార్క్ చాక్లెట్ లో ఐరన్ కూడా లభిస్తుంది. దీనిని రెగ్యులర్ గా తినడం వల్ల తెల్ల జుట్టు, పొడి జుట్టు వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.


పులియబెట్టిన ఆహారాలు:
పులియబెట్టిన ఆహారాలు సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే బ్యాక్టీరియా బయోటిన్ ఉత్పత్తి కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు పులియపెట్టిన ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల శరీరాన్ని కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook