Propose Day Wishes 2024: ప్రపోజ్ డే స్పెషల్ కోట్స్, వాట్సాప్ స్టేటస్లు, ప్రత్యేకమైన లవ్ ప్రపోజల్స్..
Propose Day Wishes For Girlfriend In Telugu: వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా రెండవ రోజు ప్రపోజ్ డేను జరుపుకుంటారు. ఈరోజు ప్రేమికులంతా వారి ప్రేమను వ్యక్తం చేస్తూ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. మీరు కూడా మీ భాగస్వామిని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా?
Propose Day Wishes For Girlfriend In Telugu: ఫిబ్రవరి నెల అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది వాలెంటైన్స్ డే.. ప్రపంచంలోని ప్రేమికులంతా ఈ వాలెంటైన్స్ డే ని ఏడు రోజులపాటు జరుపుకుంటారు.. ఇలా వారం రోజుల పాటు జరుపుకునే ప్రేమికుల దినోత్సవానికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. మొదటగా వాలెంటెన్స్ వీక్ లో భాగంగా రోజ్ డే అని జరుపుకుంటారు. ఇక రెండవ రోజు ప్రపోజ్ డే.. ఈరోజు వారికి ఇష్టమైన భాగస్వామిని ఎంచుకొని మనసులో ఉన్న ప్రేమను బయటికి చెబుతూ ఉంటారు. దీనినే ప్రపోస్ డే గా పిలుస్తారు. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన రోజున మీరు కూడా మీకు కావాల్సిన భాగస్వామిని మీ మందించే ప్రత్యేకమైన కొట్స్ ద్వారా ప్రపోజ్ చేయండి.
ప్రేమ ఎప్పుడూ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు.. కానీ అది చిగురించిన ప్రతి క్షణం నుంచి మీలో ఆనందం ప్రారంభమవుతుంది. ఎప్పటికీ ఇదే ఆనందంతో కొనసాగాలని కోరుకుంటూ..హ్యాపీ ప్రపోస్ డే..
నేను ప్రామిస్ చేస్తున్నాను.. నా జీవితం ఉన్నంతకాలం నీ చేతి వదలకుండా ప్రేమతో ఉంటాను.. ప్రపోజ్ డే శుభాకాంక్షలు!
జీవితాంతం ఇద్దరం ఎలాంటి వాగ్వాదాల్లేకుండా కలిసి జీవితం.. కష్టాసుఖాలను పంచుకుంటూ ముందుకెళ్దాం.. ప్రపోజ్ డే శుభాకాంక్షలు..
నా దృష్టిలో ప్రేమంటే దానికి అర్థం నువ్వే..
నా దృష్టిలో భార్య అంటే నువ్వే..
నా దృష్టిలో ప్రపంచమంటే నువ్వే..
నా దృష్టిలో నా గమ్యం అంటే నువ్వే..
నా దృష్టిలో అన్ని నువ్వే.. హ్యాపీ ప్రపోస్ డే..
మీరెప్పుడో నాలో భాగమైపోయారు.. ఈ ప్రపోజ్ డే సందర్భంగా అడుగుతున్నాను మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా.. మనమిద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం..
దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు..
నువ్వు నాకు ఆకాశమంత ప్రేమనిచ్చావు..
అందలేనంత సపోర్ట్ అందించావు..
ఇలా జీవితాంతం నాతోనే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ప్రపోస్ డే.
ఆకాశంలోని నక్షత్రాలన్నీ రాలిపోయేంతవరకు..
సముద్రాలన్నీ ఎండిపోయేంతవరకు..
నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను..
హ్యాపీ ప్రపోస్ డే..
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
నా హృదయం ఎప్పుడూ నిన్నే కోరుకుంటుంది..
నా మనసు నిన్ను తపించని రోజు లేదు..
నువ్వు లేకుండా నేను జీవితాంతం ఉండలేను..
హ్యాపీ ప్రపోస్ డే..
నువ్వే నా బలం.. నువ్వే నా శక్తి.. నువ్వే నా ఆలోచన.. నువ్వేనా జీవితం హ్యాపీ ప్రపోస్ డే..
ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కాదు జీవితాంతం ఒకరి కష్టాసుకాలను మరొకరు పంచుకోవడం.. ప్రేమంటే రొమాన్స్ కాదు.. ఒకరి బాధలను ఒకరు పంచుకోవడం.. హ్యాపీ ప్రపోస్ డే..
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter