Radish For Diabetes And Blood Pressure: ముల్లంగిని ఉత్తర భారతదేశంలో చలికాలంలో ఎక్కువగా వంటకాల్లో వినియోగిస్తారు.  భుర్జీ మొదలైన దాని విభిన్న వంటకాల తయారీలో ఎక్కువగా తింటూ ఉంటారు. ముల్లంగిల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇది నోటికి రుచినే ఇవ్వడం కాకుండా జీర్ణక్రియ సమస్యలకు సులభంగా చెక్‌ పెడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అయితే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
చాలా మందిలో ప్రస్తుతం మధుమేహం ప్రాణాంతక వ్యాధిలా మారుతుంది. అయితే ఈ వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ ముల్లంగి దుంపను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం తగ్గించేందుకు సహాయపడుతుంది.[[{"fid":"250455","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కాలేయ సమస్యలకు చెక్‌:
ముల్లంగిలో కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడే సమ్మేళనాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని కాలేయ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇది టాక్సిన్స్‌ను బయటకు పంపి శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది.[[{"fid":"250456","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


గుండె వ్యాధులకు:
ముల్లంగిలో యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ఆహారంలో తీసుకుంటే అధిక రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.


Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్


Also Read : Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ ఝలక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి