Ragi Laddu: ప్రతి రోజు ఈ లడ్డు తింటే.. అందరి కంటే బలవంతులవుతారు..
Ragi Laddu Benefits And Recipe: రాగి పిండితో చేసిన లడ్డులు ప్రతి రోజు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇవే కాకుండా బోలెడు లాభాలను కలిగిస్తుంది.
Ragi Laddu Benefits And Recipe: రాగి పిండితో తయారు చేసిన ఆహారాలు రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. అలాగే ఈ రాగి పిండితో తయారు చేసిన లడ్డులు ప్రతి రోజు తినడం వల్ల రక్తహీనతతో పాటు జీర్ణక్రియ సమస్యలు కూడా ఎంతో సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే రాగి లడ్డుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యవంతంగా చేసేందుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో కేలరీలు కూడా తక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి శరీర బరువును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రస్తుతం చాలా మంది రాగి పిండితో తయారు చేసిన లడ్డులను తినేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలైతే ఎక్కువగా తింటున్నారు. ఐరన్ లోపంతో బాధపడుతున్న పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చాలా మంది రాగి లడ్డులను ఇంట్లో కంటే బయల తయారు చేసినవి ఎక్కువగా కొనుకుని తింటున్నారు. అయితే వీటిని బదులుగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని తినండి. ఈ రాగి లడ్డులను ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి - 1 కప్పు
బెల్లం - 1 కప్పు (తరిగిన)
నెయ్యి - 2-3 టేబుల్ స్పూన్లు
ఏలకులు - 4-5 (పొడి చేసుకోవాలి)
ఎండుద్రాక్ష - 2 టేబుల్ స్పూన్లు (చిన్న ముక్కలు చేసిన)
బాదం - 2 టేబుల్ స్పూన్లు (చిన్న ముక్కలు చేసిన)
తయారీ విధానం:
ముందుగా ఈ రాగి లడ్డులను తయారు చేసుకోవడానికి ముందుగా బెల్లంను ఓ బౌల్‌లో వేసుకుని స్టౌవ్‌పై పెట్టుకుని పాకం వచ్చేంత వరకు మరిగించుకోండి.
ఆ తర్వాత మరో బౌల్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని బాగా వేడి అయిన తర్వాత అందులో పిండిని వేసుకుని వేయించి పక్కన పెట్టుకోండి.
ఇలా బాగా వేగిన తర్వాత బెల్లం పానకంలో ఈ పిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ మిశ్రమంలో అన్ని రకాల డ్రైప్రూట్స్ వేసుకుని మరో సారి బాగా మిక్స్ చేసుకోండి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని లడ్డుల్లాగా గుండ్రగా తయారు చేసుకోండి. అంతే రాగి లడ్డులు తయారైనట్లే..
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
చిట్కాలు:
రాగి లడ్డులు బాగుండాలంటే బెల్లం పాకం సరిగ్గా ఉండాల్సి ఉంటుంది. ఎక్కువగా ఉడికించినట్లయితే లడ్డూలు గట్టిగా ఉంటాయి.
రాగి పిండిని బాగా జల్లించి తీసుకోవడం వల్ల లడ్డు స్మూత్‌గా మారుతుంది.
ఎక్కువ రోజుల పాటు నిలువ ఉండడానికి లడ్డులను గాలి చొరబడి పాత్రల్లో భద్రపరుచుకోండి.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.