పచ్చిపాలు ఎప్పుడూ ఉత్తమమైనవే. పచ్చిపాలతో కలిగే ప్రయోజనాలు పెద్దల కాలం నుంచి చెబుతున్నవే. అందమైన పెదాల నుంచి మెరిసే కళ్ల వరకూ అన్ని రకాల ప్రయోజనాలున్నాయి. అంత అద్భుతమైనవి పచ్చిపాలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చిపాలతో ఏ విధమైన దుష్ప్రయోజనాలు లేవు. ఇంట్లో ఉండి వినియోగించవచ్చు. పాలను వేడి చేసే ముందు కొన్ని పాలు వేరు చేసుకుని.. ఆ పాలలోని మీగడ, పాలను మీ అందాన్ని తీర్చిదిద్దేందుకు ఉపయోగించవచ్చు. పచ్చిపాలతో కలిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.


మృదువైన చర్మం


పచ్చిపాలలో చాలా పోషకాలున్నాయి. ఇందులో ప్రోటీన్లు విటమిన్లు, సోడియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందుకే పచ్చిపాలు చాలా లాభదాయకం. అన్నింటికంటే చర్మానికి ఓ వరం లాంటిదని చెప్పవచ్చు. పచ్చిపాల మీగడను ముఖానికి రాసుకుంటే ఏ విధమైన మచ్చలుండవు. చర్మం మెరిసిపోతుంది. ఎందుకంటే దీనివల్ల డెడ్‌స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. మీ చర్మం డ్రైగా ఉంటే రోజూ మాయిశ్చరైజర్ రాసినట్టే పచ్చిపాలు లేదా మీగడ రాసుకోవాలి.


మెరిసే కళ్లు


కళ్లు అనేవి కేవలం చూసేందుకే కాదు..వ్యక్తిత్వానికి చాలా అవసరం. కీలకమైన భాగం. మీ కళ్లు బలహీనంగా ఉన్నా లేదా కంటి చుట్టూ నల్లటి మచ్చలున్నా పచ్చిపాలను రోజూ రాయడం ద్వారా కొన్ని రోజుల్లోనే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


అందమైన పెదవులు


చాలాసార్లు పెదవులు నిర్జీవంగా చూస్తుంటాం. అంటే పెదవులు నల్లగా మారిపోయుంటాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు పచ్చిపాల మీగడ రాసుకోవాలి. లిప్‌బామ్ కంటే పచ్చి పాల మీగడ రాయడం చాలా మంచిది. ఒకరోజులో చాలాసార్లు రాసుకోవాలి. కొన్నిరోజుల్లోనే తేడా స్పష్టంగా కన్పిస్తుంది. 


Also read: Cloves Tea: గొంతులో కఫం సమస్యను ఇట్టే కరిగించే అద్భుతమైన టీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook