Happy Pongal 2023: సంక్రాంతి ఎలా జరుపుకుంటారు.. మూడు రోజులు ఎందుకంటే..?
Sankranti Festival Special: సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల పాటు వేడుకల కోసం అందరూ సొంతూళ్లకు పయనమవుతున్నారు. పది రోజుల ముందు నుంచే సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Sankranti Festival Special: మన దేశంలో పండుగలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఏ పండుగ అయినా ఇంటిల్లిపాది కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఊరంతా సంబరాలు చేసుకుంటారు. సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ కోసం తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా.. సొంతూరికి చేరి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని కొన్ని రాష్ట్రాల్లో మాఘి, తమిళనాడులో పొంగల్ అని కూడా అంటారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చిన సందర్భంగా ఈ పండుగను ఆనందంగా నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది ఈ పండుగను సాధారణంగా జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో జనవరి 14 నుంచి 16వ తేదీ వరకు జరుపుకుంటారు.
ఈ పండుగ జరిగే మూడు రోజుల పాటు సందడి వాతావరణం ఉంటుంది. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ పర్వదినాలను జరుపుకుంటారు. పది రోజుల ముందు నుంచే ఇళ్లను రంగులు, సున్నాలతో ముస్తాబు చేసుకుంటారు. కూతుళ్లను, అల్లుళ్లను పండుగలకు పిలిచి పిండి వంటకాలను వడ్డించిపెడతారురు. ఈ పండుగను ఒక్కో రోజు ఒక ప్రత్యేకతతో వేడుకలు నిర్వహిస్తారు.
భోగీ రోజు తెల్లవారు జామునే లేచి.. భోగి మంటలు వేస్తారు. ఇంట్లోని పిల్లలు, పెద్దలు అందరూ కలిసి భోగి మంటల వద్ద చలి కాచుకుంటారు. ఇంట్లో ఉండే పాత వస్తువులు, చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన కట్టెలు, ఇతర వస్తువులు తీసుకువచ్చి.. భోగి మంటలు వేస్తారు. కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు చిహ్నంగా కూడా ఈ మంటలు వేస్తారు. సాయంత్రం చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేసి సంబరపడిపోతారు.
రెండో రోజు మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం రోజు మకర సంక్రాంతిని నిర్వహించుకుంటారు. ఉదయాన్నే పాలు పొంగించి.. అప్పటికే సిద్ధం చేసి వంటకాలను పూజ గదిలో ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది కొత్త దుస్తులు ధరించి పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి గంగిరెద్దుల సందర్శనతో ఊర్లలో సందడిగా ఉంటుంది. గంగిరెద్దులను చక్కగా అలంకరించి.. వాటిని ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలను అనుగుణంగా వాటితో నృత్యాలు చేయిస్తారు. పాటలు పాడుతూ.. చిందులు తొక్కుతూ హరిదాసు సందడి కూడా ఉంటుంది.
మూడో రోజు నిర్వహించే కనుమను పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. రైతులు తాము పండించిన పంటలో పశువులు, పక్షులు కూడా పాలుపంచుకోవాలని ధాన్యపు కంకులు తమ ఇంటి గుమ్మాలకు కడతారు. ఈ మూడు రోజులపాటు ఇళ్ల ముందు అందమైన ముగ్గులు, కోళ్ల పందాలు, ఎండ్ల పందాలతో పల్లెటూళ్లు ఆహ్లాదకరంగా మారిపోతాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మీరూ సంక్రాంతి పండుగకు ఊరెళ్లండి. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి.
Also Read: IND Vs Sri Lanka: ఆ ఒక్క షాట్ ఆడకపోయింటే భారత్‌దే గెలుపు.. అక్షర్, సూర్యకుమార్ పోరాటం వృథా
Also Read: CM Jagan: డీఎస్సీ 98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగ్ ఇవ్వండి.. సీఎం జగన్ ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook