Constipation Remedies: మలబద్ధకం సమస్యలకు చిటికెలో ఇలా చెక్ పెట్టండి..
Rid Constipation In 3 Minutes: చాలామంది ప్రస్తుతం మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు పలు రకాల సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా పలు రకాల హోం రెమెడీస్ ని వినియోగించాలని చెబుతున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Rid Constipation In 3 Minutes: బయట లభించే వివిధ రకాలైన అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల పొట్టలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా చాలామందిలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొట్టలో సమస్యల్లో భాగంగా ప్రస్తుతం చాలా మందిలో మలబద్ధకం సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపడమే కాకుండా.. పలు రకాల హోమ్ రెమెడీస్ ని కూడా వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మలబద్ధకం సమస్యలకు ఇలా చెక్ పెట్టొచ్చు:
జామకాయ:
చాలామంది జామకాయలను తినేందుకు ఇష్టపడతారు. ఇది అన్ని కాలాల్లో సులభంగా లభించే పండ్లు. అయితే ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్న వారు ఈ జామకాయలను అల్పాహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జామకాయలు పులుపు ఉంటే:
కొన్నిచోట్ల లభించే జామకాయలు పులుపు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి కూడా శరీరానికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. పులుపు ఉన్న జామకాయలు తినడం ఇష్టం లేకపోతే వాటిపై ఉప్పు చల్లి అల్పాహారంలో భాగంగా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వీటిని ఆహారాలను తయారు చేసుకునే క్రమంలో కూడా ఉపయోగించవచ్చు.
పొట్ట సమస్యలు తగ్గుతాయి:
పొట్టలో ఏదైనా అసౌకర్యంగా ఉంటే తప్పకుండా రెండు నుంచి మూడు జామకాయలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా పొట్ట నొప్పులు, పొట్టపై వాపులు, జీర్ణ క్రియను మెరుగుపరచేందుకు కూడా సహాయపడతాయి.
Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..
Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook