Dandruff Home Remedies: ఏం చేసినా చుండ్రు తగ్గట్లేదు.. రూపాయి ఖర్చు లేకుండా ఇలా శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..
Get Rid of Dandruff Naturally: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా ఆధునిక జీవనశైలి పాటించే అందరిలోనూ జుట్టు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో చుండ్రు పేరుకుపోవడం జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ని ప్రతిరోజు వినియోగించండి.
Get Rid of Dandruff Naturally: ఆధునిక జీవనశైలి, వాతావరణ కాలుష్యం పెరగడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు కారణంగా చాలామందిలో అతి చిన్న వయసులోనే జుట్టు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్యల ప్రభావం మరింత పెరుగుతోంది. తరచుగా చలికాలంలో అందరూ ఎదుర్కొనే జుట్టు సమస్యలు చుండ్రు సమస్య ఒకటి. దీనివల్ల చుండ్రు రాలడమే కాకుండా జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. కొంతమందిలో క్రమంగా హెయిర్ ఫాల్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బట్టతల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చుండ్రు కేవలం సీజనల్ సమస్యా?
చుండ్రు అనేది సీజనల్ సమస్య కాదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఏడాది పొడవునా ఎవరికైనా రావచ్చు అని ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య తీవ్రత పెరగొచ్చని వారు అంటున్నారు. ఈ చుండ్రు సమస్యలతో బాధపడేవారిలో నెమ్మదిగా చుండ్రు రాలుతూ ఆ తర్వాత జుట్టు రాలే అవకాశాలు కూడా ఉన్నాయని సౌందర్య నిపుణులు అంటున్నారు.
వింటర్ సీజన్లో చుండ్రు రావడానికి కారణాలు:
ఒత్తిడి
చురుకైన నూనె గ్రంథులు తెచ్చుకోవడం
సోరియాసిస్
పొలుసుల దద్దుర్లు
దురద
సెబోరోహెయిక్ చర్మ శోథ
సహజంగా చుండ్రు సమస్యలకు చెక్ పెట్టే రెమెడీస్:
రోజ్మేరీ:
రోజ్మేరీలో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణాలు ఉన్నాయి. దీన్ని నీటిలో కరిగించి జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చుండ్రు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తాయి. కొంతమందిలో దీనిని అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
టీ ట్రీ ఆయిల్:
ఈ టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. 1 టీస్పూన్ క్యారియర్ ఆయిల్ (ఆలివ్ ఆయిల్ లేదా గ్రాండ్ ఆయిల్)లో 7 చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలుపుకొని జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చుండ్రు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీళ్లతో సమపాళ్లలో కలిపి షాంపూ లాగా జుట్టుకు పట్టించాలి. జుట్టును బాగా మర్దన చేసి షాంపూతో శుభ్రం చేసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చుండ్రు తొలగిపోతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter