Diabetes Control: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు చక్కెర అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీరు ఆహారాల్లో ముతక ధాన్యంతో తయారు చేసిన రోటీలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన పీచు పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించి, రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రింస్తుంది. అయితే ఏయే పిండిలతో తయారు చేసిన రోటీలను తినాలో తెలుసుకోండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే రోటీలు:
రాజగిర పిండి:

రాజగిర పిండితో తయారు చేసిన రోటీలను మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పిండిలో అధిక మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి దీనితో తయారు చేసిన రోటీలను ప్రతి రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్లు, ఖనిజాలు, లిపిడ్లు ఉంటాయి. దీంతో క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.


జొన్న పిండి:
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది జొన్న పిండిని వినియోగించి వివిధ రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. ఇందులో ఐరన్, కాల్షియం మరియు బి విటమిన్లు అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ వీటితో తయారు చేసిర రోటీలు తింటే, సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా వీటిని దోసె, ఇడ్లీ, ఉప్మాలుగా చేసుకుని కూడా తీసుకోవచ్చు.


ఓట్స్‌ పిండి:
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి చాలా మంది బరువు తగ్గే క్రమంలో డైట్‌లో వినియోగిస్తున్నారు. అయితే ఈ పిండితో తయారు చేసిన రోటీలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా నియంత్రణలో ఉంటాయి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారంలో ఓట్స్‌ పిండితో తయారు చేసిన రోటీలను తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి 


Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి