Saloon like Shiny Hair: చాలామంది వేలల్లో పార్లర్లకు డబ్బులు ఖర్చు పెట్టి జుట్టు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా సెలూన్ వంటి షైనీ లుక్ జుట్టుకు రావాలని ఈ చర్యలు తీసుకుంటారు .దీనికి హెయిర్ కేర్ రొటీన్‌ మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన జీవన శైలిని అనుసరించడం ప్రారంభించాలి. అయితే మీ జుట్టు గ్లాసి లుక్ సెలూన్ వంటిది రావాలంటే ఇలా చేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామందికి జుట్టు పొడి వారినందు వల్ల అనేక సమస్యలు వస్తాయి. దీంతో జుట్టు డ్యామేజ్ హెయిర్ ఫాల్ సమస్యలు కూడా వస్తాయి. వాతావరణం, సరైన జీవనశైలి పాటించకపోవడం, ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుంది. దీంతో జుట్టు పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఇలా కాకుండా మీ జుట్టుకు పునరుజ్జీవనం రావాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి.


ఎల్లప్పుడు జుట్టును చల్లనీటితోనే శుభ్రం చేయండి. దీంతో కుదుళ్ల ఉండే అదనపు నూనెలో తొలగిపోతాయి. మంచి నీటితోనే హెయిర్ వాష్ చేయాలి. ఇది జుట్టుకు పునరుజ్జీవనం అందిస్తుంది . ఎక్కువ శాతం మాయిశ్చర్ ఉండేలా నిలుపుతుంది. ఫ్రీజీనెస్ సమస్య తగ్గిస్తుంది. స్నానం చేసిన వెంటనే కాటన్ టవల్ తో మృదువుగా తల తుడుచుకోవాలి.


ఇదీ చదవండి: హోటల్ స్టైల్ లో గుంతపొంగనాలు ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి..


తలపై పరిశుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే క్లెన్సింగ్ షాంపూలు వాడాలి తలపై ఉండే చెత్తను తొలగించి జుట్టుకు అందాన్ని పెంచుతుంది. హెల్తి ఫుడ్స్ తినాలి ముఖ్యంగా ఫ్యాటీ ఆసిడ్స్, చేపలు, అవకాడో ఆలివ్స్ బ్లూబెర్రీలు, గింజలు, గుడ్లు, పాలకూర వంటి ఆహారాలు మీ డైట్ లో ఉంటే ఇది మంచి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ప్రేరేపిస్తాయి.


రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఒక అరగంట పాటు ఎక్సర్సైజ్ చేస్తే జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. ఖనిజాలు, ఫ్లూయిడ్స్ ను శరీరంలోకి నిర్వహిస్తాయి ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.


స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా కొన్ని ఎక్సర్సైజులు తీసుకోవాలి. ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. అంటే తరచూ యోగా, శ్వాస సంబంధిత ఎక్సర్సైజులు చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇది జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.


ఇదీ చదవండి: మీ జుట్టుకు కొబ్బరి నీళ్లు ఇలా వాడారంటే.. జుట్టు నల్లగా.. మందంగా.. నడుము వరకు పెరుగుతుంది..


కుదుళ్లకు మసాజ్ చేయడం కూడా అవసరం. తలలో బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడాలంటే కుదుళ్లకు మసాజ్ చేస్తూ ఉండాలి. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ప్రేరేపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి