Showering Mistakes 5 Mistakes That You Didn't Know You Were Making When Showering : సాధారణంగా అందరూ స్నానం చేసే విషయంలో పెద్దగా జాగ్రత్తలు పాటించరు.. హా ఏముందిలే చేసేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల చాలా నష్టాలు తలెత్తుతాయి. మరి స్నానం చేసేటప్పుడు అస్సలు చేయకూడని 5 పనులు (5 Mistakes) ఏమిటో ఒకసారి చూడండి..చర్మ సంరక్షణ నిపుణుల (Skin care professionals) ప్రకారం.. తలస్నానం చేసేటప్పుడు చేయకూడనివి ఇవే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కువ సేపు వద్దు..


చాలా మందికి స్నానం చేసేటప్పుడు వెచ్చని నీటిని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది. అయితే మీకు ఎంత ఆహ్లాదకరంగా అనిపించినా కూడా ఎక్కువ సేపు అలాగే ఉండకండి. అలా ఉండడం మీ చర్మానికి (Skin) హానికరం. దాంతో మీ చర్మం పొడిబారినట్లుగా మారుతుంది. ఒకవేళ ఇప్పటికే మీ చర్మం తరుచుగా పొడిబారినట్లుగా అనిపిస్తుంటే.. మీరు స్నానం చేసే సమయాన్నిఐదు, పది నిమిషాలకు తగ్గించాలి.


తరచుగా చేస్తున్నారా..


కొందరు రోజులో రెండు మూడుసార్లు స్నానం చేసే వాళ్లు కూడా ఉంటారు. అలా వెంట వెంటనే చేయడం కూడా చర్మానికి మంచిది కాదు. దీంతో మీ చర్మం పొడిబారుతుంది. లేదంటే దురద సమస్య వస్తుంది. అవసరమైన దానికంటే ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే రక్షణ వ్యవస్థ (The protective system on the skin) దెబ్బ తింటుంది. చేతులను మాత్రం తరచుగా శుభ్రం చేసుకోండి.


కేవలం ఉదయమే స్నానం చేయడం..


చాలా మంది ఉదయాన మాత్రమే స్నానం చేస్తుంటారు. స్నానం ఉదయం మాత్రమే చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. స్లీప్ మెడిసిన్ రివ్యూస్‌ అధ్యయనం ప్రకారం.. మీరు నిద్రపోవడానికి ఓ గంట లేదంటే రెండు గంటల ముందు వెచ్చని నీటితో (warm water) స్నానం చేయడం మంచిది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. 


Also Read : Scrub Typhus: హైదరాబాద్‌లో స్క్రబ్ టైఫస్ కలకలం-టెన్షన్ పెట్టిస్తోన్న మరో వ్యాధి


ఏవేవో ప్రోడక్స్ వాడొద్దు..


చాలా మంది స్నానానికి ఏవేవో ఉత్పత్తులు వాడుతుంటారు. కెమికల్స్ ఎక్కువగా ఉండేటటు ఉత్పత్తులు (Products) ఉపయోగిస్తుంటారు. యాంటీ బ్యాక్టిరియా నుంచి రక్షణ కల్పిస్తాయని అలాంటివి ఎక్కువగా వాడుతుంటారు. కానీ అలా చేయకండి. సాధారణ సబ్బు కూడా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. సాధారణ సబ్బులు కూడా ఇన్ఫెక్షన్లను దూరం చేయగలవు. ఎక్కువ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు వాడకండి. 


ఎక్కువ వేడి నీరు వద్దు..


చలికాలంలో చాలా మంది ఎక్కువ వేడి ఉన్న నీటితో స్నానం చేస్తుంటారు. అలా చేయకండి. గోరు వెచ్చని నీళ్లు (Lukewarm water) చాలు. ఎక్కువ వేడి ఉండే నీటిని స్నానానికి వినియోగించడం వల్ల.. మీ చర్మానికి రక్షణగా ఉండే న్యాచురల్ ఆయిల్స్, లిపిడ్స్ తగ్గిపోతాయి. దీంతో చర్మంపై దురద సమస్య రావొచ్చు. లేదంటే పొడిగా మారుతుంది.


Also Read : Allu Arjun Wife: బ్లాక్ శారీలో అల్లు అర్జున్ సతీమణి.. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి