Pillows:మీకు తలకింద ఎత్తుగా దిండ్లు పెట్టుకునే అలవాటు ఉందా.. అయితే ఈ ప్రమాదం తప్పదు మరి..
Sleeping position:చాలామంది నిద్రపోయేటప్పుడు ఎలా పడితే అలా పడుకుంటారు .తలకింద దిండును కూడా కన్వీనియంట్ గా ఉంది అనే సాకుతో ఇష్టం వచ్చిన యాంగిల్ లో పెడతారు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. మరి అవేమిటో తెలుసుకుందాం..
Sleeping Pillow:సాధారణంగా మనం నిద్రపోయే టైంలో తలకింద పిల్లో లేకుండా పడుకోవడం కష్టం. కొంతమంది అయితే కోటగోడల్లాగా పిలోస్ పేర్చి పెట్టుకుంటారు.. అయితే తల దిండు వాడే పద్ధతి సరిగ్గా లేకపోతే మనకు తలనొప్పి, మెడ నొప్పి ,వెన్ను నొప్పి లాంటి పలు రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనలో చాలామంది తల కింద రెండు ,కాళ్ళ కింద మరొక రెండు దిండ్లు..తమకు నచ్చిన విధంగా వాడుతూ ఉంటారు .ఇలాంటి వారికి ఎన్నో రకాల నరాలకు సంబంధించిన ఇబ్బందులను కూడా ఎదుర్కొని అవకాశం ఉంది .అయితే తల కింద దిండును ఎలా ఉపయోగించాలి ? ఎలా ఉపయోగించకూడదు? సరిగ్గా వాడకపోవడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
మెడ నొప్పి ఎక్కువగా ఉన్నవారు తలకింద దిండుని అస్సలు వాడకూడదు. మరీ ఎత్తుగా ,గట్టిగా ఉన్న దిండ్లు కూడా వాడకూడదు. స్టైల్ గా ఉంటుంది అని రౌండ్ గా సిలిండర్కల్ షేప్ లో ఉన్న దిండ్లు తో బెడ్ ని డెకరేట్ చేస్తారు. ఇక వాటిని తలకిందో.. కాలికిందో పెట్టుకుంటారు. వీటివల్ల నొప్పులు ఎక్కువ అయే ఆస్కారం ఉంటుంది. ఎక్కువ ఎత్తులో ఉన్న దిండు ఉపయోగించడం వల్ల మెడకు..తలకు మధ్య ఉన్న గ్యాప్ దగ్గర నొప్పి ఏర్పడుతుంది. కాబట్టి మెడ నొప్పి ,తలనొప్పి ఉన్నవారు వీలైనంతవరకు తల దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల నొప్పులు క్రమంగా తగ్గుతాయి.
చాలామందికి టీవీ లేక కంప్యూటర్ చూస్తూ కూర్చున్న సమయంలో వెనుక దిండు పెట్టుకొని వీపు ఆనిచ్చి కూర్చోవడం బాగా ఇష్టంగా ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల క్రమంగా వెన్నుపూస వంగినట్లుగా మారిపోతుందట. దీనివల్ల మెడ నొప్పి రావడమే కాకుండా వెన్నుపూస బలహీన పడుతుంది. మరీ మెత్తగా ఉన్న దిండ్లు కూడా వాడడం మంచిది కాదు. మనం వాడే దిండు కవర్ లేదా గలీబు రెండు రోజులకు ఒకసారి మార్చుకోవాలి. లేకపోతే వాటిలో చేరిన బ్యాక్టీరియా వల్ల మనకు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook