Home decoration ideas: చిన్న ఇంటిని ముచ్చటగా ముస్తాబు చేసే ఐడియాస్.. అది కూడా తక్కువ ఖర్చుతో
Home decoration: మనం ఉంటున్న ఇల్లు మన మనసుకు అద్దం లాగా అని పెద్దలు అంటారు. ఆ ఇంటిని మనం ఎంత కళాత్మకంగా ,శుభ్రంగా ఉంచుకుంటాము అనే దాన్ని పట్టి మన మనసు పై ఇంటి పాజిటివ్ ప్రభావం ఉంటుందట. అయితే అందరికీ ఇంద్రభవనాలు ఉండాలి అంటే కుదరదు కదా. చిన్నదైనా ఇంటిని అందంగా ఎలా చక్కదిద్దుకోవాలో తెలుసుకుందామా..
Home decoration: మనం ఉంటున్న ఇల్లు.. అందంగా పెట్టుకోవడం ఎంత ఇష్టం ఉన్నా సరే కొన్నిసార్లు ఎలా సర్దుకోవాలో అర్థం కాక తలనొప్పి వస్తుంది. పైగా ఇల్లు చిన్నదైతే అందంగా, ఎక్కువ అడ్డాలు లేకుండా ఎలా సర్దాలో తెలియక ఆడవారు తికమక పడుతుంటారు. పెద్దగా ఉన్న ఇంట్లో ఎన్ని వస్తువులనైనా పెట్టవచ్చు కానీ చిన్న ఇంటిని అందంగా ముస్తాబు చేయాలి అంటే పెద్ద సవాలే. చిన్న ఇంటిని కూడా సులభంగా ఎలా ముస్తాబు చేసుకోవచ్చు తెలుసుకుందాం..
పేరుకి నలుగురే ఉన్నా..ఇంట్లో సామాన్లు ఎన్నో ఉంటాయి. అలాంటప్పుడు అన్నిటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే ఈ చిన్ని చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ఇంటిని సులభంగా డెకరేట్ చేయడమే కాకుండా ఎంతో స్పేసియస్ గా ఉంచుకోవచ్చు. అయితే దీనికి ముందుగా మీరు ముఖ్యమైన వస్తువులు ఏవి అనే విషయంపై స్పష్టత పెట్టుకోవాలి. ఏ వస్తువులను మీరు ఎక్కువగా వాడుతున్నారు వేటిని ఎప్పుడో అవసరానికి మాత్రమే ఉపయోగిస్తారు అన్న విషయం క్లియర్ గా తెలిస్తే సర్దుకోవడం చాలా సులభం అవుతుంది.
వస్తువులను ఎప్పుడూ నేల మీద చిందరవంతరగా వదలకూడదు. డిస్పోజబుల్ అల్మారాలను లేదా షెల్ఫ్ లాంటివి ఉపయోగించి వీటిని జాగ్రత్తగా సర్దుకోవాలి. చిందర వందరగా ఎక్కడపడితే అక్కడ ఎలక్ట్రిక్ లైట్స్ పెట్టే బదులు నేలపై స్కాన్ ల్యాంప్స్ ఉంచడం వల్ల ఇల్లు మరింత అందంగా కనిపిస్తుంది. అలాగే అవసరానికి ఉపయోగించాలి అనుకునే డెస్క్ లేక టేబుల్ ఫోల్డబుల్ టైప్ అయితే బాగుంటుంది. అవసరం ఉన్నప్పుడు వాడుకొని మిగిలినప్పుడు ఫోల్డ్ చేసి పక్కన పెట్టొచ్చు. దీనివల్ల ఇంట్లో స్థలం కలిసి వస్తుంది.ఇక ఇంట్లో ఎప్పుడు వెలుతురు బాగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వెలుతురు ఉన్న ఇల్లు ఎప్పుడు అందంగా , ప్రశాంతంగా ఉంటుంది.
ఇంటి కార్నర్స్ లో ఎసెన్షియల్ ఆయిల్ సోక్ చేసిన కాటన్ బాల్స్ ఉంచడం వల్ల ఇల్లు ఎప్పుడు సువాసనగా ఉంటుంది.గోడలకు డిఫరెంట్ కలర్ పెయింటింగ్స్ వేయడం వల్ల ఇంటి లుక్ అందంగా మారుతుంది.తక్కువ స్థలం లో ఇరుకు ఇరుకుగా వస్తువులను పెట్టడం వల్ల ఇల్లు చాలా చిందర వందరగా కనిపిస్తుంది.అందుకే ఎప్పుడైన ఇంటి డెకరేషన్ కోసం కొత్త వస్తువులు కొనేటప్పుడు పాత వాటిని డిస్పోస్ చేయడం అలవాటు చేసుకోండి. అంతే కాదు ఏదైనా కొనాలి అంటే అవసరం ఉంటే తప్ప అనవసరంగా కొనకండి. ఇలా చిన్నపాటి ట్రిక్స్ ఫాలో అయితే మీ ఇల్లు ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంటుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సలహా మేరకు సేకరించడం జరిగింది ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.
Also Read: WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి