Sitting Crossed Legs: కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారా? ఈ నమ్మలేని నిజాలు తెలిస్తే, షాక్ అవుతారు!
Sitting Crossed Legs: చాలామంది ఆఫీసుల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ ఉంటారు. నిజానికి ఇలా కూర్చోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా కూర్చోవడం వల్ల అనేక రకాల దీపికారిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయట. కొంతమందిలో వెన్నునొప్పి కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
Sitting Crossed Legs: చాలామందికి కాలు మీద కాలేసుకుని కూర్చునే అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే ఆఫీసుల్లో ఒక కాలు చేర్లో పెట్టుకొని.. మరో కాలు కిందకి వదిలేసి కూర్చొని ఉంటారు. మరి కొంతమంది అయితే చేరులోనే రెండు కాళ్లు ముడుచుకొని కూర్చుంటూ ఉంటారు. నిజానికి ఇలా కూర్చోవడం మంచిదేనా? ముఖ్యంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఎంతవరకు మంచిది? ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చట. కొంతమందిలో ఇలా కూర్చోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వారు అంటున్నారు. నిజానికి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఏర్పడే దుష్ప్రభావాలు:
రక్తప్రసరణలో అంతరాయం:
చాలామందిలో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల కాళ్లలోని నరాలపై తీవ్ర ఒత్తిడి పడి రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు దీనివల్లనే కొంతమందిలో కాళ్లు ఉబ్బడం, మరి కొంతమందిలో నొప్పులు రావడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయట. అలాగే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే భవిష్యత్తులో తిమ్మిర్లు వంటి సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తీవ్ర నరాల సమస్యలు:
ఎక్కువసేపు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే నరాలకు ఊహించని నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కాలు కొంటుబడడం, కాలు తరచుగా ఉబ్బడం వంటి సమస్యలకు కూడా దారితీస్తుందట. ఇప్పటికే నరాల సమస్యలతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు:
మరికొంతమందిలోనైతే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల జీర్ణ క్రియ పూర్తికా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కొంతమందిలో మలబద్ధకంతో పాటు తీవ్ర పొట్ట సమస్యలు కూడా వస్తున్నాయట. ఇంకొంతమందిలోనైతే అజీర్ణం పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం మానుకోండి.
వెన్నునొప్పి:
తరచుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల వెన్నునొప్పి తో పాటు మెడ నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట. తరచుగా వెన్నునొప్పి రావడానికి కొంతమందిలో ఇలా కూర్చోవడమే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తీవ్ర వెన్నునొప్పి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
సైయాటికా:
మరికొంతమందిలోనైతే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల సైయాటికా కూడా వస్తోంది. దీనివల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో ఈ వ్యాధి మొత్తం వ్యాపించి వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులకు కూడా దారితీస్తోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గంటల తరబడి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.