Skin Care Tips: వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీజన్ మారినప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు కచ్చింగా ఎదురౌతాయి. ఎండాకాలం నుంచి వర్షాకాలంలో..వర్షాకాలం నుంచి చలికాలంలో...తిరిగి చలికాలం నుంచి ఎండాకాలంలో మారిన ప్రతిసారీ ఇబ్బంది కలుగుతుంది. శరీరంలో ఉండే ఉష్ణోగ్రతకు భిన్నంగా వాతావరణముంటే..నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా పింపుల్స్, రింగిల్స్, దురద వంటి సమస్యలు కన్పిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తేనె, లవంగ అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండింటి సహాయంతో పింపుల్స్, మొటిమలను దూరం చేయవచ్చు. ఈ రెండింటి మిశ్రమం స్కిన్ ఇన్‌ఫెక్షన్, పింపుల్స్ దూరం చేస్తుంది. లవంగం, తేనె కలిపి రాయడం వల్ల డెడ్‌స్కిన్ కణాలు కూడా యాక్టివ్‌గా మారతాయి. చర్మం నిగనిగలాడుతుంది. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..


మీ ముఖంపై మొటిమలు, పింపుల్స్ లాంటివి కన్పిస్తే..వెంటనే క్రీమ్స్ లాంటివి రాయడం అలవాటు. కానీ కెమికల్స్‌తో కూడిన వస్తువులు ఎప్పుడూ శాశ్వతంగా పరిష్కారాన్ని ఇవ్వవు. దీర్ఘకాలం ఈ సమస్యల్నించి గట్టెక్కాలంటే..ఇంట్లోనే సులభంగా చిట్కాలతో తగ్గించుకోవచ్చు. తేనె, లవంగం కలిపి మిశ్రమంగా చేసుకుని ప్రతిరోజూ ఉదయం లేవగానే ముఖానికి రాసుకుని మస్సాజ్ చేసుకోవాలి. కాస్సేపటి తరువాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి నిగారింపు వస్తుంది. ముఖంపై మచ్చలు రోజుల వ్యవధిలోనే తొలగిపోతాయి.


వర్షాకాలంలో ఫ్రైడ్ ఆహార పదార్ధాలు, ఆయిలీ ఫుడ్స్ కారణంగా స్కిన్ ఇన్‌ఫెక్షన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అందుకే లవంగం, తేనె పేస్ట్ వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ముందుగా నిమ్మకాయతో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత లవంగం, తేనె మిశ్రమాన్ని రాసుకోవాలి. వారంలో 3-4 సార్లు చేస్తే మంచి ఫలితాలు త్వరగా ఉంటాయి.


లవంగం తేనెలకు ఆయుర్వేదంలో మంచి ప్రస్తావన ఉంది. లవంగం, తేనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకు చాలా ముఖ్యం. తేనె మీ చర్మానికి మృదుత్వాన్ని, నిగారింపును ఇస్తుంది.


Also read: White Hair Problem: చింతాకులతో ఇలా చేస్తే చాలు..తెల్ల జుట్టు సమస్య మటుమాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook