Soda Water Benefits: ముఖాన్ని శుభ్రం చేసేందుకు వివిధ రకాల ఫేస్‌వాష్, సబ్బుల కంటే అత్యత సులభమైన పద్ధతి మరొకటుంది. ఆ పద్దతిలో ముఖం కడుక్కుంటే..అద్భుతమైన తాజాదనంతో పాటు స్కిన్ గ్లో కూడా వస్తుందని తెలుసా..ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్మ సంరక్షణ, నిగారింపు కోసం చాలామంది ఎన్నో రకాల ఉత్పత్తుల్ని వినియోగిస్తుంటారు. ఇంకొంతమంది  హోమ్ రెమిడీస్ ట్రై చేస్తుంటారు. ముఖాన్ని శుభ్రం చేసేందుకు వివిధ రకాల ఫేస్‌వాష్, సబ్బులు వాడుతుంటారు. ఇవన్నీ ఫలితాన్నిస్తాయో లేదో గానీ..మరో సులభమైన పద్ధతితో ట్రై చేస్తే కచ్చితంగా ఫలితాలుంటాయి. అద్భుతమైన తాజాదనంతో పాటు స్కిన్ గ్లో వస్తుంది. ఆ పద్ధతి సోడా వాటర్. ఆశ్చర్యంగా ఉన్నా...పూర్తిగా నిజమిది. చాలామందికి ఈ విషయం తెలియదు. 


కానీ సోడాతో ముఖం కడుక్కుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. అంతేకాదు చర్మ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. సోడా వాటర్‌తో ముఖం వాష్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనేది చూద్దాం..


సోడా వాటర్‌తో ముఖం కడగడం వల్ల చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి వంటి వ్యర్ధాలు, ఆయిల్, బ్లాక్‌హెడ్స్ వంటివి పూర్తిగా శుభ్రమౌతాయి. ముఖంపై మీరు ఊహించని ఫ్రెష్‌నెస్ వస్తుంది. బడలిక తగ్గిన అనుభూతి కలుగుతుంది. ఫలితంగా పింపుల్స్ ఉంటే నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి. అందుకే సోడా వాటర్‌తో ముఖం శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోమంటున్నారు బ్యూటీ కేర్ నిపుణులు. 


సోడా వాటర్ ప్రయోగంతో ముఖంపై తేమ ఉత్పన్నమౌతుంది. డ్రై స్కిన్ ఉండేవారికి ఈ పద్ధతి లాభదాయకం. చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది. మరీ ముఖ్యంగా డెడ్ స్కిన్ నుంచి ఉపశమనం పొందేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. సోడా వాటర్‌తో ముఖాన్ని కడిగేటప్పుడు ముఖంపై నెమ్మదిగా మాలిష్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ పోతుంది. ముఖంపై మచ్చలు, మరకలు, పింపుల్స్ వంటివి కూడా పూర్తిగా తొలగిపోతాయి. రోజూ బయట్నించి వచ్చిన వెంటనే సోడాతో ముఖం కడిగే అలవాటు చేసుకుంటే ముఖంపై నిగారింపు వస్తుంది. బడలిక మొత్తం పోయిన అనుభూతి కలుగుతుంది. ఫ్రెష్నెస్ వస్తుంది. 


Also read: Yoga Asanas: మలబద్ధకం, అసిడిటీ, వికారం వంటి సమస్యలకు చిటికలో ఇలా చెక్‌ పెట్టండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook