Fair Skin Tips: ఈ మ్యాజిక్ ఆయిల్ అప్లై చేస్తే..తమన్నా లాంటి అందం, మిల్కీ స్కిన్ మీ సొంతం
Fair Skin Tips: అందం మెరుగుపర్చుకునేందుకు, చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యానికి చాలా చిట్కాలున్నాయి. ఇందులో ఓ మేజిక్ ఆయిల్ కూడా ఉంది. ఈ ఆయిల్ అప్లై చేస్తే..తమన్నా అందం మీ సొంతమవుతుంది.
తమన్నా పేరు వింటే చాలు మిల్కీ బ్యూటీ పదం గుర్తొస్తుంది. ఆమె చర్మం, రంగు అలా ఉంటుంది మరి. మీరు కూడా తమన్నా ఒంటి ఛాయలా మిళమిళ మెరవాలంటే మ్యాజిక్ ఆయిల్ వాడాల్సిందే. ఆ వివరాలు మీ కోసం.
ఆ మ్యాజిక్ ఆయిల్ పేరు కోకోనట్ ఆయిల్ బాడీ ప్యాక్. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ కే వంటి పోషకాలు చాలా ఉంటాయి. ఇవి మీ చర్మం డెడ్ స్కిన్ తొలగించి రంగును మెరుగుపరుస్తాయి. సాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. స్కిన్ డార్కెనింగ్ ఇందులో ప్రధానమైంది. చర్మం నల్లగా మారడం లేదా కాంతి కోల్పోవడం ప్రదానంగా కన్పిస్తుంది. ఈ క్రమంలో కోకోనట్ ఆయిల్ బాడీ ప్యాక్ ఈ సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది.
ఆలివ్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మంపై డార్క్ ఏరియాను మాయిశ్చరైజ్‌గా ఉంచడంలో దోహదం చేస్తుంది. అంతేకాకుండా..కోకోనట్ ఆయిల్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ కే వంటి పోషకాలు చర్మంపై ఉండే డెడ్ స్కిన్ తొలగిస్తాయి. ఫలితంగా చర్మం రంగు మెరుగుపడుతుంది.
కోకోనట్ ఆయిల్ బాడీ ప్యాక్ తయారీకు కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ అవసరమౌతాయి. ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో 3-4 చెంచాల కొబ్బరి నూనె, 1-2 చెంచాల ఆలివ్ ఆయిల్, కొద్దిగా నువ్వుల నూనె వేయాలి. ఈ మూడింటిని బాగా కలపాలి ఇప్పుడీ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.
కోకోనట్ ఆయిల్ బాడీ ప్యాక్‌ను మోచేతులు, ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపు అలానే వదిలేసి..ఆ తరువాత గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేస్తుంటే కొద్దిరోజుల్లోనే చర్మం నిగనిగలాడుతూ తయారవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook