Pimple Care Tips: ముఖంపై మొటిమల సమస్య బాధిస్తోందా..ఇలా చేస్తే 10 రోజుల్లో మాయం
Pimple Care Tips: ముఖంపై తరచూ ఏర్పడే పింపుల్స్ సాధారణమైపోయింది. అమ్మాయిల అందం మొత్తం పాడవుతుంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో పింపుల్స్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
పింపుల్స్ సమస్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. డైట్‌లో జాగ్రత్తలు, కొన్ని చిట్కాలు పాటిస్తే కేవలం 10 రోజుల్లోనే పింపుల్స్ నిర్మూలన సాధ్యమౌతుంది. ఆ వివరాలు మీ కోసం.
ముఖంపై పింపుల్స్ ఏర్పడి అందవికారంగా తయారవుతుంటారు. ఈ సమస్య ఇటీవలి కాలంలో ఎక్కువౌతోంది. ప్రధానంగా ఆయిలీ స్కిన్ పై ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తుంది. పింపుల్స్ ఏర్పడటానికి ఒక నిర్దిష్ట కారణం లేదు. మనం తినే ఆహార పదార్ధాలు కూడా ఓ కారణం. పింపుల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని పదార్ధాలకు దూరంగా ఉండాల్సిందే.
షుగర్ ఫుడ్స్
మీ చర్మంపై లేదా ముఖంపై పింపుల్స్ ఉంటే షుగర్ అధికంగా ఉండే పదార్ధాలు తీసుకోకూడదు. పంచదార అనేది ఎప్పుడూ హార్మోన్‌తో పాటు స్వెల్లింగ్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది. షుగర్ ఫుడ్స్ తినడం తగ్గిస్తే ఇన్సులిన్ నియంత్రణలో ఉండి..పింపుల్స్ సమస్య నెమ్మదిగా తగ్గుతుంది.
డైరీ ఉత్పత్తులు
డైరీ ఉత్పత్తులు అంటే పాలతో తయారైన పదార్ధాలు పింపుల్స్ సమస్యను పెంచుతాయి. ఇవి తినడం వల్ల మీ శరీరంలో హార్మోన్స్ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా చర్మంపై పింపుల్స్ ఏర్పడతాయి. డైరీ ఉత్పత్తులకు ఎంత దూరం పాటిస్తే అంత మంచిది.
హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్
బంగాళదుంప, కేక్, పుచ్చకాయ, కుకీజ్ వంటి హై గ్లైసిమిక్ ఫుడ్స్ వల్ల పింపుల్స్‌కు కారణమయ్యే ఐజీఎఫ్ 1 హార్మోన్‌ను పెరుగుతుంది. అందుకే పింపుల్స్ సమస్యతో బాధపడేవాళ్లు వీటిని దూరంగా పెట్టాలి. పింపుల్స్ సమస్య నుంచి కాపాడుకునేందుకు ముఖంపై ఎప్పుడూ ఆయిల్ పేరుకోకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా నిద్రపోయే ముందు ముఖం శుభ్రంగా కడగాలి.
Also read: Cancer Vaccine: కేన్సర్‌పై బిగ్ అలర్ట్, 2031 నాటికి కేన్సర్ వ్యాక్సిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook