Skin Care Cream: మీ చర్మం మృదువుగా, నిగనిగలాడాలంటే ఈ హ్యాండ్‌క్రీమ్ రాస్తే చాలు, తయారీ ఎలాగంటే
Skin Care Cream: వేసవి సీజన్ నడుస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. చర్మం నల్లబడకుండా, మృదువుగా ఉండేందుకు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు.
Skin Care Cream: ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో చర్మం నల్లబడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్యకు సులభంగా పరిష్కారం లభిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
ఎండాకాలంలో చర్మాన్ని సంరక్షించుకునేందుకు అద్భుతమైన చిట్కా ఉంది. మృదువైన, నిగినిగలాడే చేతులు, చర్మం కోసం ఎక్స్‌ఫోలియేషన్ చాలా అవసరం. గ్లిసరిన్ హ్యాండ్‌క్రీమ్ ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. గ్లిసరిన్ హ్యాండ్‌క్రీమ్ రాయడం వల్ల మీ డెడ్ స్కిన్ తొలగిపోతుంది. చర్మంలో నిగారింపు వస్తుంది. చర్మం రంగు మారుతుంది. గ్లిసరిన్ హ్యాండ్‌క్రీమ్‌తో చర్మానికి కావల్సిన పోషకాలు అందుతాయి. చర్మాన్ని డీప్ నరిష్ చేస్తుంది. మరి గ్లిసరిన్ హ్యాండ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
గ్లిసరిన్ హ్యాండ్ క్రీమ్ తయారు చేసే విధానం
గ్లిసరిన్ హ్యాండ్ క్రీమ్ తయారు చేసేందుకు ఒక స్పూన్ గ్లిసరిన్, 1 స్పూన్ రోజ్ వాటర్, 2 స్పూన్స్ కొబ్బరినూనె, 1 స్పూన్ బాదం నూనె అవసరమౌతాయి.
ముందు ఓ గిన్నె తీసుకోవాలి. ఇందులో బాదం నూనె, కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. రెండూ బాగా కలిసేంతవరకూ వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలో వేసి చల్లార్చాలి. ఆ తరువాత ఇందులో రోజ్ వాటర్, గ్లిసరిన్ కలపాలి. అన్నింటినీ పూర్తిగా కలిపి ఓ కంటైనర్‌లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే మంచి ఫలితాలుంటాయి.మృదువైన చర్మంతో పాటు కాంతివంతమైన చర్మానికి అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది.
Also read: Health Tips: టీతో పాటు ఈ 5 పదార్ధాలు పొరపాటున కూడా తీసుకోవద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook