Skin Care Tips: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ చర్మ పరిరక్షణ, ముఖ సౌందర్యం కోసం పరితపిస్తుంటారు. మార్కెట్‌లో ఎన్నో రకాల బ్యూటీ కేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా పెద్దగా ప్రయోజనం కన్పించదు. అదే సమయంలో రసాయనాల కారణంగా దుష్పరిణామాలు ఎదురౌతుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ సౌందర్యం, చర్మం నిగారింపుకు సరైన పరిష్కారం అల్లోవెరా జెల్. అల్లోవెరా అనేది ఔషదాలతో నిండి ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు అందాన్ని మెరుగుపర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని కల్గిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలిక్ యాసిడ్, కోలీన్, బీ1, బీ2, బీ3, బీ6, బీ12 పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల చర్మానికి అద్భుత ప్రయోజనాలుంటాయి. రోజూ రాత్రి వేళ అల్లోవెరాను ముఖానికి మస్సాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చర్మానికి నిగారింపు, యౌవనం, అందం అన్నీ వచ్చి చేరుతాయి. ముఖంపై మచ్చలు, మరకలు, పింపుల్స్ సమస్యలు కూడా దూరమౌతాయి. అల్లోవెరా జెల్ మస్సాజ్ వల్ల చర్మం ట్యానింగ్ దూరమై..డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ముఖంపై ముడతలు, గీతలు ఉండవు. అల్లోవెరా జెల్‌తో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..


రోజూ రాత్రి వేళ అల్లోవెరా జెల్‌తో ముఖానికి మసాజ్ చేస్తుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. దీంతోపాటు చర్మం వదులు పోతుంది. అంటే చర్మానికి ఫిట్నెస్ వస్తుంది. ఫలితంగా ముఖంపై ఉండే ముడతలు పోతాయి. ముఖంపై ఏర్పడే మచ్చలు, మరకలు, పింపుల్స్ కూడా దూరమౌతాయి. చర్మంలో కొలాజెన్ పెంచేందుకు ఉపయోగపడుతుంది.


ఎండలో ఎప్పుడు బయటికెళ్లినా ముఖానికి కొద్దిగా అల్లోవెరా జెల్ రాసుకోవాలి. దీనివల్ల చర్మానికి సూర్య రశ్మిలో ఉండే యూవీ కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా చర్మానికి ఉండే ర్యాషెస్ నుంచి కూడా రక్షణ కలుగుతుంది. స్కిన్ కేర్ ప్రక్రియలో అల్లోవెరా చేర్చడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. ఫలితంగా చర్మానికి నిగారింపు వస్తుంది. అల్లోవెరాలో ఉండే యాంటీ ఏజీయింగ్ గుణాల కారణంగా వృద్ధాప్య లక్షణాలుండవు. నిత్య యౌవనంగా కన్పిస్తారు. 


Also read: Glowing skin: 10 నిమిషాల్లో బొప్పాయి ఫేస్ జెల్‌తో మృదువైన, మెరిసే చర్మం మీ సొంతం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook