Skin Care Tips: రోజూ ఆ పాలు రాస్తే..25 ఏళ్ల యవ్వనం మీ సొంతం, నిగనిగలాడనున్న చర్మం
Skin Care Tips: పాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే పాలను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. అయితే పచ్చిపాలతో చర్మం నిగారింపుతో పాటు నిత్య యవ్వనంగా కన్పించవచ్చని ఎంతమందికి తెలుసు..
చలికాలం వచ్చేసింది. ఈ సమయంలో చర్మం దెబ్బతినే ముప్పు పెరుగుతుంది. ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. అయితే పచ్చిపాలను తాగడం ద్వారా కాకుండా..ముఖానికి అప్లై చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
పాలలో పోషక పదార్ధాలు చాలా ఎక్కువ. అందుకే పాలను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ప్రతిరోజూ పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయి. చలికాలంలో సహజంగానే చర్మం డ్రై అవుతుంటుంది. ముఖంపై కూడా ఆ ప్రభావం మరింతగా ఎక్కువగా ఉంటుంది. చర్మం డ్యామేజ్ కారణంగా దురద కూడా వస్తుంటుంది. ఒక్కోసారి చర్మం మంట పుడుతుంటుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు పచ్చి పాలను వినియోగించవచ్చు. చర్మం దెబ్బతినడంతో పాటు మచ్చలు పోయి ట్యానింగ్ నుంచి విముక్తి లభిస్తుంది.
పచ్చిపాలను ఎలా ఉపయోగించాలి
పాలలో కాల్షియం, ప్రోటీన్లు, పొటాషియం, ఫాస్పరస్ సహా చాలా పోషక పదార్ధాలున్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు ఉపయోగించి..చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేయవచ్చు. పచ్చిపాలను చర్మానికి రాయడం వల్ల డ్రైనెస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
రాత్రి వేళ చర్మానికి పచ్చిపాలు రాయడం అలవాటు చేసుకుంటే..చర్మం నిగారింపు పెరుగుతుంది.పచ్చిపాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్సెఫలేట్ చేస్తుంది. ఫలితంగా చర్మం మెరుస్తుంది. చేతులు, కాళ్లకు కూడా రాయడం వల్ల చర్మం ట్యానింగ్ కాకుండా ఉంటుంది. పచ్చిపాలతో కంటి కింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ దూరమౌతాయి. ఇంకా చాలారకాల స్కిన్ ఎలర్జీలు దూరమౌతాయి.
వయస్సు పెరిగే కొద్దీ ముఖంపై సహజంగానే ముడతలు ఏర్పడుతుంటాయి. చర్మ నిపుణుల ప్రకారం..ముడతల్ని దూరం చేసేందుకు పచ్చిపాలతో ముఖానికి మస్సాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు యాంటీ ఏజీయింగ్‌లా పనిచేస్తాయి. యవ్వనంగా కన్పిస్తారు. ముఖంపై పింపుల్స్ సమస్య తొలగించేందుకు కూడా ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది.
Also read: Dark Circles Removal Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ చిట్కాలతో శాశ్వతంగా డార్క్ సర్కిల్స్ చెక్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook