వయస్సు పెరిగే కొద్దీ చర్మం నిగారింపు కోల్పోతుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వయస్సు మీరినా చర్మం యౌవనంగానే ఉంటుంది. దీనికే యాంటీ ఏజీయింగ్ అంటారు. చర్మం ఎప్పటికీ కాంతివంతంగా ఉండాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్మ సంరక్షణ అనేది చాలా చాలా అవసరం. సరైన రీతిలో చర్మాన్ని పరిరక్షించుకుంటే వయస్సు దాటినా చర్మం నిత్య యౌవనంతో మెరుస్తుంటుంది. రోజుకు తగిన నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర తక్కువైనా చర్మం నిర్జీవంగా మారుతుంది. డైట్‌లో విటమిన్ లోపం కూడా చర్మం నిర్జీవంగా మారేందుకు ఓ కారణం. అనేక చర్మ సంబంధిత సమస్యల్నించి పోరాడేందుకు విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా తీసుకోవల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఎలాంటి విటమిన్లు అవసరమో తెలుసుకుందాం..


చర్మం నిగారింపు పెంచే విటమిన్లు


విటమిన్ కే చర్మ సంరక్షణ, నిగారింపుకు అతి ముఖ్యమైన విటమిన్. చర్మకాంతిని పెంచడంతో పాటు పిగ్మంటేషన్ సమస్యను కూడా దూరం చేస్తుంది. ఏదైనా గాయమైనప్పుడు త్వరగా మానేలా చేస్తుంది. ఈ క్రమంలో డైట్‌లో గోభి, బ్రోకలీ, ధనియా, దలియా చేర్చితే మెరుగైన ఫలితాలుంటాయి. వీటివల్ల చర్మం ఆరోగ్యంగా, సహజకాంతితో ఉంటుంది. 


ఇక విటమిన్ ఇ మరింత ముఖ్యమైంది. విటమిన్ ఇ లోపిస్తే చర్మం సహజకాంతిని కోల్పోతుంది. ఎందుకంటే విటమిన్ ఇ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ములక్కాయ, ఆవాల నూనె, బాదం, పాలకూర, ఆనపకాయ, కివీ, టొమాటో, బ్రోకలీలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఇ ఆయిల్ కూడా మంచి ఫలితాలనిస్తుంది. దీనివల్ల చర్మంలో మంట, డ్రైనెస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. చర్మం సహజకాంతిని పొందుతుంది. 


Also read: mustard oil benefits: 12 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారే అద్భుతమైన చిట్కాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook