Oily Skin Care Tips: స్కిన్ కేర్ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉంటే చాలా కేర్ తీసుకోవాలి. ఆయిలీ స్కిన్ సమస్య ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్య పరిరక్షణలో కీలకం స్కిన్ కేర్. చర్మ సంరక్షణకు చాలా జాగ్రత్తలు అవసరం. చర్మ సంరక్షణలో ప్రధానమైనంది క్లీనింగ్. ముఖంపై ఉండే దుమ్ము, ధూళి, వ్యర్ధాల్ని తొలగించాలంటే ప్రధానంగా కావల్సింది క్లీనింగ్. అయితే ముఖం క్లీన్ చేసేటప్పుడు కొన్ని కీలకమైన విషయాల్ని పరిగణలో తీసుకోవాలంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. స్కిన్ ఎలాంటిదో పరిశీలించాలి. ఎందుకంటే అన్ని స్కిన్ టైప్ సమస్యలకు వేర్వేరుగా చికిత్స ఉంటుంది. మీది ఆయిలీ స్కిన్ అయితే..శుభ్రం చేసే పద్ధతి వేరేలా ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు..ముఖాన్ని క్లీన్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల్ని పరిగణలో తీసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..


ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ ముఖాన్ని క్లీన్ చేసేముందు ఈ విషయాన్ని పాటించాలి. మీ స్కీన్ ఆయిలీగా ఉంటే..క్లీన్సర్ లేదా ఫేస్‌వాష్‌తో క్లీన్ చేయకూడదు. మ్యాట్ ఫినిషింగ్ ఉండే ఫేషియల్ క్లీన్సర్‌ను మాత్రమే వినియోగించాలి. ఎందుకంటే ఇది మీ ఆయిలీ స్కిన్ రోజంతా ఆయిలీగా కన్పించకుండా చేస్తుంది. చార్ కోల్ క్లీన్సర్ మంచి ఫలితాలనిస్తుంది. 


డబుల్ క్లీన్సింగ్ పద్థతులతో..


ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు కేవలం క్లీన్సర్ ఉపయోగిస్తే సరిపోదు. డబుల్ క్లీన్సింగ్ పద్థతులు పాటించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో ముందుగా మినరల్ వాటర్ సహాయంతో మేకప్, వ్యర్ధాలు లేదా ముఖంపై ఆయిల్ తొలగించాలి. ఆ తరువాత ఫేస్‌వాష్‌తో స్కిన్ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తరచూ ముఖంగా ఆయిల్ రాకుండా నియంత్రించవచ్చు.


ఓవర్ క్లీన్సింగ్ ఎప్పుడూ మంచిది కాదు. చాలామంది చేసే పొరపాటు కూడా ఇదే. ఆయిలీ స్కిన్ నుంచి ఉపశమనం పొందేందుకు తరచూ ముఖం క్లీన్ చేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల ముఖంపై ఉండే సహజసిద్ధమైన ఆయిల్ పోతుంది. 


Also read: Allergic Cough: ఎలర్జిక్ దగ్గు ఎలా ఉంటుంది, లక్షణాలేంటి, రెండు చిట్కాలతో పరిష్కారం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook