Whiteheads: వైట్‌హెడ్స్ సమస్య బాధిస్తోందా, ఈ చిట్కాలతో సులభంగా తొలగించుకోవచ్చు
Whiteheads: నిత్య జీవితంలో చేసే వివిధ పొరపాట్లు లేదా తప్పిదాల ప్రభావం ముఖ సౌందర్యంపై పడుతుంటుంది. పింపుల్స్, వైట్‌హెడ్స్ వంటివి ఏర్పడి..ముఖం అంద వికారంగా మారుతుంటుంది. మరి ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి...
మనిషి శరీరానికి ఆరోగ్యం ఎంత అవసరమో అందం కూడా అంతే ముఖ్యం. కారణం అందం సగం ఆరోగ్యం కాబట్టి. అందుకే చాలామంది ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఈ క్రమంలో ప్రధానంగా బాధించే సమస్య వైట్‌హెడ్స్. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలనేది పరిశీలిద్దాం.
ముఖంపై, ముక్కుపై ఏర్పడే వైట్‌హెడ్స్ కారణంగా చర్మం రఫ్‌గా మారిపోతుంటుంది. దురద కూడా ఉంటుంది. ఫలితంగా ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. చాలామంది గోర్ల సహాయంతో వైట్‌హెడ్స్ తొలగించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలి, సౌందర్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ఎందుకంటే చర్మానికి లేదా ముఖానికి ఏ మాత్రం హాని కలగకుండా వైట్‌హెడ్స్ తొలగించే సులభమైన పద్ధతులు చాలా ఉన్నాయి.
వైట్‌హెడ్స్ తొలగించే మార్గాలు
మీ ముక్కు లేదా ముఖంపై వైట్‌హెడ్స్ ఎక్కువగా ఉంటే..ఓ ప్రత్యేకమైన ఫేస్‌ప్యాక్ రాయాల్సి ఉంటుంది. ఓ గిన్నెలో రోజ్ వాటర్, అల్లోవెరా జెల్, తేనె కలుపుకుని..మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వైట్‌హెడ్స్ ప్రాంతంలో రాయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. చాలామంది ముఖం శుభ్రతపై పెద్దగా దృష్టి పెట్టరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫేస్ క్లీన్సింగ్ చాలా ముఖ్యం. రోజుకు 2 సార్లు ముఖ్యం శుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకించి నిద్రపోయేముందు ముఖాన్ని గోరువెచ్చని నీళ్లలో శుభ్రం చేసుకోవడం మంచిది.
వైట్‌హెడ్స్ తొలగించేందుకు చాలామంది హార్డ్ స్క్రబ్ వినియోగిస్తుంటారు. దీనివల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చర్మం ఒలిచిపోతుంటుంది. ఆ తరువాత ఆ గాయం నయమయ్యేందుకు చాలా సమయం పట్టవచ్చు. ఒకవేళ మీ ముఖంపై వైట్‌హెడ్స్ సమస్య ఎంతకీ తగ్గకపోతే..వారంలో 2 సార్లు ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. దీనికోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే బియ్యం, తేనె, పిండి కలిపి ఎక్స్‌ఫోలియేట్ తయారు చేయవచ్చు.
తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లేటప్పుడు ముందుగా సన్‌స్క్రీన్ తప్పకుండా రాయాలి. క్రీమ్ అప్లై చేసేముందు సౌందర్య నిపుణుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ ఒక్కోలా ఉంటుంది. వైట్ హెడ్స్ నుంచి విముక్తి పొందేందుకు వారంలో 2 సార్లు శెనగపిండి, బియ్యం, ముల్తానీ మిట్టి కలిపి చర్మానికి రాసుకోవాలి. దీనివల్ల తొందరగానే ఫలితాలు సాధిస్తారు.
Also read: Signs of Death: మరణించేముందు శరీరం ఏ సంకేతాలను పంపిస్తుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook