Skin Care Tips: అందం సగం ఆరోగ్యం అంటారు పెద్దలు. చర్మ సంరక్షణ అందుకే చాలా అవసరం. చర్మ సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది డ్రై స్కిన్. చర్మ సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాత్రి నిద్రపోయేముందు ఆ చిన్న పనిచేస్తే..డ్రై స్కిన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాత్రి నిద్రించేముందు చర్మం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అలా చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఎందుకంటే ఎక్కువమంది ఇబ్బంది పడేది డ్రై స్కిన్ సమస్యతోనే. ఈ సమస్యను దూరం చేసేందుకు చాలామంది వివిధ రకాల క్రీములు, ఆయిల్స్ అప్లై చేస్తుంటారు. అయితే రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా చర్మ సంరక్షణ చేస్తే మంచి ఫలితాలుంటాయి. చర్మ సంరక్షణకు రాత్రి నిద్రించేముందు ఏం చేయాలనేది తెలుసుకుందాం..


1. చాలామంది డ్రై స్కిన్ సమస్యకు కారణం మేకప్. అందుకే రోజూ నిద్రించేముందు మీ మేకప్ తొలగించుకోవడం మర్చిపోకూడదు. మేకప్ రిమూవర్ లేదా రోజ్ వాటర్ వినియోగించాలి.


2. మేకప్ తొలగించిన తరువాత క్లీన్సర్ సహాయంతో ముఖంపై పేరుకున్న వ్యర్ధాల్ని తొలగించాలి.


3. ఇప్పుడు మీ చర్మంపై టోనర్ రాయాలి, టోనర్ సహాయంతో చర్మం పీహెచ్ లెవెల్ బ్యాలెన్స్ చేయవచ్చు.


4. ఇప్పుడు మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు సీరమ్ వాడాలి. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. 


5. మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మానికి కావల్సిన న్యూట్రియంట్లు లభిస్తాయి. దాంతోపాటు చర్మానికి అవసరమైన నేచురల్ ఆయిల్ ఉత్పత్తిలో దోహదపడుతుంది. 


Also read: Ayurvedic Hair Care Tips: ఏం చేసిన జుట్టు రాలడం ఆగడం లేదా..అయితే ఈ ఆయుర్వేద చిట్కాలతో ఈ సమస్యకు చెక్‌ పెట్టండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook