Tanning Removal Tips: ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ కూడా మనిషికి చాలా అవసరం. చర్మంపై తగిన శ్రద్ధ తీసుకోకపోతే వివిధ రకాల సమస్యలు ఏర్పడి అందమే దెబ్బతింటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో చర్మం గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఇది అవసరం కూడా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవి కాలంలో ఎండల కారణంగా చర్మం ట్యానింగ్ అవుతుంటుంది. అంటే నల్లగా మారిపోతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్లయితే సన్‌బర్న్ కారణంగా నొప్పి కూడా అనుభవిస్తుంటారు. ట్యానింగ్ సమస్య తొలగించడమంటే చాలా సున్నితమైన వ్యవహారమిది. మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు వినియోగించినా ఫలితముండదు. కొన్ని సందర్భాల్లో అందులో రసాయనాల కారణంగా రియాక్షన్ అవుతుంటుంది. అందుకే సాధ్యమైనంతవరకూ స్కిన్ ట్యానింగ్ సమస్య దూరం చేసేందుకు సహజసిద్ధమైన చిట్కాలే అవలంభించాలి. వీటి వల్ల దుష్పరిణామాలుండవు అదే సమయంలో ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. ఇప్పుుడు ఇక్కడ చర్చించేది కూడా అలాంటి సులభమైన పద్ధతుల గురించే. వీటి సహాయంతో ట్యానింగ్, ముడతలు, పింపుల్స్, ముఖంపై పేరుకునే ఆయిల్ తొలగించడానికి వీలవుతుంది. ఈ పద్దతులు అవలంభించడం వల్ల ముఖానికి నిగారింపు వచ్చి మచ్చల్లేకుండా ఉంటుంది. మిళమిళలాడుతుంది. 


బంగాళ దుంప పద్ధతి


స్కిన్ ట్యానింగ్ సమస్య పోగొట్టేందుకు బంగాళదుంపను ఉడికించి ఓ గిన్నెలో తీసుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని 10-15 నిమిషాలుండాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. బంగాళదుంపలో ఉండే నేచురల్ బ్లీచింగ్ గుణాలు చర్మంపై ట్యానింగ్ సమస్యను దూరం చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ మాస్క్‌ను వారంలో 2-3 సార్లు రాసుకోవాలి.


బొప్పాయి తేనె


దీనికోసం 2 చెంచాల బొప్పాయి గుజ్జులో 2 చెంచాల తేనె కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10-15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. బొప్పాయి, తేనె ఫేస్‌ప్యాక్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. వారానికి 4-5 సార్లు రాయడం వల్ల చర్మంపై ట్యానింగ్ సమస్య దూరమై..ముఖానికి నిగారింపు వస్తుంది. 


కాఫీ టొమాటో


టొమాటో 2 ముక్కలు తీసుకుని ఇందులో ఒక స్పూన్ తేనె, సగం స్పూన్ కాఫీ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. టొమాటోలో బ్లీచింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖానికి రాసుకోవడం వల్ల ట్యానింగ్ సమస్య సులభంగా పోతుంది. 


బియ్యం పిండి పాలు


రెండు స్పూన్స్ బియ్యం పిండిలో తగినంత చల్లని పాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20-25 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. బియ్యం పిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఫలితంగా ముఖంపై ట్యానింగ్ సమస్య చాలా సులభంగా తొలగిపోతుంది. 


Also read: Weight Loss Tips: సహజమైన ఈ పద్ధతులు పాటిస్తే అధిక బరువు సమస్యకు ఇట్టే చెక్ చెప్పవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook