Skin Care Tips: కేవలం పదే పది రోజుల్లో మచ్చలు లేని, మెరిసే చర్మం మీ సొంతం!
How To Make Fennel Face Pack At Home: ఫెన్నెల్ ఫేస్ ప్యాక్ వినియోగించడం వల్ల చర్మ సమస్యలన్ని సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చ్చలు లేని, మెరిసే చర్మం పొందొచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Make Fennel Face Pack At Home: సోంపు వంటకాల రుచిన పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చాలా వంటకాల రుచులను గుమగుమలాడించడానికి సహాయపడుతుంది. అయితే ఇందలో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిని ఫేస్ ప్యాక్‌లా వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫేస్ ఫ్యాక్ ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్‌లను తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని మెరిపించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఫేస్ ఫ్యాక్‌ను వినియోగించడం ఎలాంటి ఇతర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడుతు తెలుసుకుందాం.
ఫెన్నెల్ ఫేస్ ప్యాక్ తయారీకి అవసరమైన పదార్థాలు:
1 టీ స్పూన్ సోంపు పొడి
1 టీ స్పూన్ పెరుగు
ఫెన్నెల్ ఫేస్ ప్యాక్ తయారి పద్ధతి:
ఫెన్నెల్ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి.
మీరు అందులో 1 టీస్పూన్ ఫెన్నెల్ పౌడర్, 1-2 టీస్పూన్ పెరుగు వేసుకోవాలి.
తర్వాత ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి మిశ్రమంలా తయారు చేసుకోండి.
అంతే సులభంగా ఫేస్ ఫ్యాక్ తయారవుతుంది.
ఈ ఫేస్ ప్యాక్‌ను ఇలా వినియోగించండి:
ఈ ఫేస్ ప్యాక్‌ను వినియోగించడానికి ముందుగా బాగా శుభ్రం చేసుకోండి.
తర్వాత ముఖం, మెడ పై బాగా అప్లై చేయాల్సి ఉంటుంది.
ముఖానికి అప్లై చేసి, అరగంట పాటు అలాగే ఉంచండి.
తర్వాత మంచినీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.
ఇలా క్రమం తప్పకుండా వినియోగిస్తే మచ్చలు లేని, మెరిసే చర్మం మీ సొంతం.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook