Skin Care Tips: చాలామంది మగవారిలో నుదుట ముడతలు ఎక్కువగా ఉంటుంటాయి. ఫలితంగా వృద్ధాప్యఛాయలు, నిర్జీవం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంటాయి. మరి ఈ ముడతల్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నుదుట ముడతలు పడి..చర్మం కాంతి విహీరంగా కన్పిస్తూ ముఖంలో వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. మహిళల కంటే ఎక్కువగా పురుషుల్లో ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు మార్కెట్‌లో లభించే చాలా రకాలు ఉత్పత్తులు వినియోగిస్తుంటారు కానీ ప్రయోజనం ఉండదు. చర్మం ఇంకా పాడైపోతుంటుంది. అందుకే మీ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. దీనికోసం కొన్ని వస్తువులను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ క్రమంలో నుదుట ముడతల్నించి ఉపశమనం కల్గించే కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం..


మహిళలతో పోలిస్తే పురుషులు ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంటారు. ఎక్కువ మంది చర్మ సంరక్షణపై దృష్టి కూడా పెట్టరు. ఫలితంగా చర్మం నిర్జీవంగా మారిపోతుంటుంది. అందుకే ఎండలో ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తీక్షణమైన సూర్య కిరణాల్నించి రక్షించుకోవాలి. ఒకవేల ఎండలో ఉండాల్సి వస్తే మాత్రం మంచి సన్‌స్క్రీన్ వాడాలి. మరోైవైపు మీ పని భారాన్ని ఒత్తిడిగా భావించకూడదు. ఆందోళన చెందకూడదు. ఇలా చేయడం వల్ల సమస్యలు ఇంకా పెరిగిపోతాయి. ఫలితంగా నుదుట ముుడతలు పెరిగిపోతాయి. ఒత్తిడి తగ్గించుకునేందుకు  మెడిటేషన్, యోగా, అరోమా థెరపీ, సరైన నిద్ర అవసరమౌతాయి. వీటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.


ఎండిపోయిన, నిర్జీవమైన చర్మం నుంచి రక్షించుకునేందుకు మీరు చర్మాన్ని హైడేట్ చేసుకోవాలి. మీ శరీరం అవసరమైనంతగా హైడ్రేట్ అయుంటే..నుదుటే కాదు మరెక్కడా పెద్దగా ముడతలు కన్పించవు. ఎండాకాలంలో కూడా చర్మం మెరుస్తుంటుంది. అందుకే రోజంతా ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. దీనికోసం రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. ఒకవేళ మీ చర్మాన్ని సంరక్షించుకోవాలంటే..ధూమపానం పూర్తిగా మానేయాలి. చర్మ సంరక్షణతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి


Also read: Cholesterol Tips: కొలెస్ట్రాల్‌తో ప్రాణానికే ముప్పు..ఆయుర్వేద చిట్కాలతో అద్భుత వైద్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.