Smartphone Addiction: ఆధునిక కాలంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో పాటు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. వీటి వల్ల కొన్ని పనులు సులభతరమైనా.. ప్రతికూలతలను కూడా మనుషులకు పరిచయం చేస్తున్నాయి. ఈరోజుల్లో చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దీని వాడకం వల్ల ముఖ్యంగా సోషల్ మీడియా బారిన పడిన వారంతా దాని నుంచి బయటపడలేకపోతున్నారు. చిన్నారులైతే చేతిలో ఫోన్ లేనిదే తిండి తినమని మారాం చేస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కు బానిసగా మారిన పిల్లలను దాని నుంచి బయటకు తీసుకురావడం ఎలానో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) పుస్తక పఠనంపై అవగాహన


ఇంటర్నెట్ యుగంలో పిల్లలు పుస్తకాలకు దూరంగా ఉంటున్నారు. ఇంట్లో ఉండే పెద్దవారు పిల్లల ముందు బుక్స్ పట్టుకొని చదువుతుంటే దాన్ని పిల్లలు కూడా ఫాలో అవుతారు. అలా పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి. 


2) ప్రకృతిపై ప్రేమను పెంచండి


అంతేకాకుండా పిల్లలను ప్రకృతికి చేరువ చేసినా మొబైల్‌కు దూరమవుతారు. సహజ పదార్థాల ప్రాముఖ్యతను పిల్లలకు చెప్పడం ఎంతో అవసరం. అలా ప్రకృతిపై ప్రేమ ఏర్పడిన తర్వాత వాళ్లు మొబైల్ కు దూరంగా ఉంటారు. 


3) అవుట్ డోర్ గేమ్స్ ఆడమని ప్రోత్సాహించాలి


కరోనా సంక్షోభం కారణంగా పిల్లలు చాలా కాలం పాటు ఇంట్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలో వాళ్లు మొబైల్ కు ఎంతో అలవాటు పడ్డారు. దీంతో పాటు ఆన్ లైన్ క్లాసులు, కోచింగ్ వంటి వాటి వల్ల స్మార్ట్ ఫోన్స్ ను పిల్లలకు అందించాల్సి వచ్చింది. మొబైల్ వాడకం పెరగడం వల్ల ఆటలపై ఆసక్తి తగ్గిపోయింది. కాబట్టి, ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. 


4) మొబైల్ కు పాస్ వర్డ్ పెట్టడం వల్ల..


ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు మొబైల్ వాడకాన్ని తగ్గించకపోతే తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించాలి. లేదంటే వాళ్లు మొబైల్ కు మరింత బానిసలు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు వాడే స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ పెట్టడం వల్ల కూడా వాడకాన్ని తగ్గించవచ్చు.  


Also Read: Mosquito Prevention: దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఈ టెక్నిక్ పాటించండి!


ALso Read: Bad Food Combinations: కీర దోసకాయతో పాటు ఈ కూరగాయలు అసలు తినొద్దు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.