Soapberries For Reduce Hair Fall: జుట్టు రాలడాన్ని తగ్గించే అతి చౌకైనా హోమ్ రెమిడీ.. పెద్దగా ట్రీట్మెంట్ అక్కర్లేదు..
Soapberries For Reduce Hair Fall: జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కుంకుడుకాయ హోమ్ రెమెడీస్ ని ప్రతిరోజు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.
Soapberries For Reduce Hair Fall: ప్రస్తుతం చాలామందిలో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది అతి చిన్న వయసులోనే చాలామంది సులభంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది దీంతో వారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు వీటిని వాడడం వల్ల జుట్టు తెల్లబడడం నిర్జీవంగా మారడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని కుంకుడుకాయ హోమ్ రెమెడీస్‌ని తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. కుంకుడుకాయలో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టును దృఢంగా ఉంచడమే కాకుండా రాలడాన్ని సులభంగా తగ్గిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును మందంగా చేసేందుకు కూడా సహాయపడతాయని వారంటున్నారు అయితే చుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి కుంకుడుకాయలను ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. కుంకుడుకాయ షాంపూ:
ప్రస్తుతం మార్కెట్లో కుంకుడుకాయ కాయలతో తయారుచేసిన రసాయనాలతో కూడిన షాంపులు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని వినియోగించుకుంటే జుట్టు రాలడాని సులభంగా తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఈ కుంకుడుకాయ షాంపుని తయారు చేయడానికి ముందుగా 10-15 కుంకుడు కాయలను రాత్రంతా నానబెట్టండి. ఉదయం వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. పట్టుకున్న మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు చుట్టూ పట్టించి బాగా మసాజ్ చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే అనేక రకాల లాభాలు పొందుతారు.
2. కుంకుడుకాయ పేస్ట్:
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కుంకుడుకాయ పేస్ట్ కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్లో లభించే కుంకుడుకాయ పేస్టుకి బదులుగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని వినియోగిస్తే మరింత మంచి ఫలితం పొందుతారని వారంటున్నారు. అయితే ఈ పేస్టుని తయారు చేయడానికి ముందుగా 5-6 కుంకుడు కాయలను నీటిలో ఉడకబెట్టండి. చల్లారిన తర్వాత గుజ్జును వేరు చేయండి. ఈ గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.
3. కుంకుడుకాయ నూనె:
కుంకుడుకాయ నూనె కూడా జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. మార్కెట్లో లభించే వాటికంటే ఇంట్లో తయారుచేసిన కుంకుడుకాయ నూనెనే రెట్టింపు లాభాలు కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ముందుగా 10 కుంకుడు కాయలను 200 ml కొబ్బరి నూనెలో వేసి, 2 గంటలు చిన్న మంట మీద ఉడికించాలి. చల్లారిన తర్వాత, ఈ నూనెను వడగట్టి, జుట్టుకు రాసి మసాజ్ చేయండి. మసాజ్ చేసిన గంట తర్వాత శుభ్రమైన నీటితో జుట్టును బాగా కడగాలి.
4. కుంకుడుకాయ హెన్నా:
జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు కుంకుడుకాయ హెన్నా కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు ఈ కుంకుడుకాయ హెన్నాను వినియోగించడం వల్ల కుదుళ్ళు బలంగా, నలుపు రంగులోకి మారుతాయి. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల హెన్నా పొడిలో 1 టేబుల్ స్పూన్ కుంకుడు కాయ పొడి కలపండి. ఈ మిశ్రమాన్ని నీటితో కలిపి, పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించి, 2-3 గంటల తర్వాత శుభ్రం చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి