ప్రపంచంలో ఏ వస్తువు అమ్మలన్నా.. కొన్నాలన్నా పన్ను తప్పనిసరి. ఈ పన్నులు వ్యక్తికి లేదా సంస్థలకి ప్రభుత్వాలు రాజ్యంగం ప్రకరంగా విధించేవిగా ఉంటాయి. మన దేశంలో అయితే కేంద్రం, రాష్ట్రం రెండూ పన్నులను విధిస్తాయి. కానీ, ప్రపంచంలోని కొన్ని దేశాలు విధించే పన్నులు వింటే మీకూ విడ్డూరం అనిపించకమానవు. ఆ పన్నులు ఏంటో, అవి ఏ దేశాలు విధిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..!! అన్నట్టు.. ఆ దేశాల జాబితాలో కూడా మన దేశం ఉందండోయ్..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనా


దూరానికీ పన్నుకు ముడిపెట్టిన చరిత్ర చైనాలోని 'చౌ' వంశీయులది. వారి హయాంలో రాజధానికి చేరువలో ఉన్న పొలాలకు చెందిన రైతుల పై 5 శాతం పన్ను విధించేవారు. పొలాల దూరాన్ని బట్టి రైతులపై గరిష్టంగా 25 శాతం పన్ను విధించేవారు.


ఈజిప్ట్


ఈజిప్ట్  అంటే అందరికీ గుర్తొచ్చేవి 'పిరమిడ్' లు. 'పిరమిడ్' నిర్మించడానికి ఫారో చక్రవర్తి వద్ద ఖజానాలో డబ్బులు లేకుంటే.. ఆయన ఏకంగా తన కుమార్తెను వ్యభిచారంలోకి దించాడట..! ఆమె తనతో గడిపే విటుల నుంచి డబ్బుతో పాటు విటుల నుంచి పిరమిడ్ నిర్మాణానికి కావాల్సిన రాళ్ళనూ ఫీజుకింద డిమాండ్ చేసేది. తదనంతర కాలంలో ఆమె మరణించిన తరువాత ఈ రాళ్లతోనే కప్పెట్టేశారట..! ఇంతకీ ఈ పిరమిడ్ కోసం ఎన్ని రాళ్లు వాడారోతెలుసా? 20 వేల రాళ్లు.


జర్మనీ


జర్మనీ సర్కార్ 2004లో కోత పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. దీనిప్రకారం ఫుల్ టైం సెక్స్ వర్కర్లు స్థానిక సంస్థలకు ప్రతినెలా 150 యూరోలు  చెల్లించాలట. పార్ట్ టైం  సెక్స్ వర్కర్లు వారి వారి పని దినాలను బట్టి ఆరు యురోలు చెల్లించేవారట


సియటిన్


చచ్చిన తరువాత కూడా పన్ను కట్టాల్సిందే అంటోది సియాటిన్. సియాటిన్‌లోని కింగ్ కౌంటీలో మరణంపైనా పన్ను చెల్లించాల్సిందే అని చెబుతూ మూడేళ్ల కిందట ఒక చట్టాన్ని అమలు చేయటాన్ని మొదలుపెట్టారు. మృతుని బంధువులు వైద్యపరీక్ష అధికారి కార్యాలయంలో 50 డాలర్లు చెల్లించాలి. అప్పుడు మాత్రమే మృతదేహాన్ని తగలబెట్ట డానికి, ఖననం చేయడానికి అనుమతి లభిస్తుంది. దీన్ని స్థానికులు డెత్ టాక్స్ అని పిలుస్తారు.


జపాన్


క్రీ.శ. 15 వ శతాబ్దం చివరి దశకంలో జపాన్ చక్రవర్తి హిడేయోషి రైతులను పీల్చి పిప్పి చేశాడు. రైతులు పండించిన పంటలో మూడింట రెండొంతుల పన్ను కట్టాల్సిందే అని హుకుం జారీ చేశారు. పంటల్లో.. వరి పంటపై ఉక్కుపాదం మోపాడు. ఏకంగా వరి ఉత్పత్తులపై 67 శాతం పన్నును వసూలు చేశాడంటే..ఆ రాజు ప్రజలను ఎంత పీడించేవాడో అర్థమవుతోంది.


భారతదేశం


మనదేశంలోనూ అప్పటి రాజులు వింత పన్నులు విధించారు. కేరళలో ట్రావెన్కోర్ వంశీయులు రొమ్ము పన్ను విధించారు.


పూర్తి వివరాల కోసం ఇక్కడ చదవండి: స్త్రీల రొమ్ముపై పన్ను వేసిన రాజ్యం


ఇంగ్లాండ్


క్రీ.శ. 1696 లో ఇంగ్లాండ్‌లో మూడవ విలియం  'కిటికీ పన్ను'ను ప్రవేశపెట్టారు. ఇంటికి ఉన్న కిటికీల సంఖ్య ఆధారంగా విండో టాక్స్ వసూలుచేసేవారు. పది, ఆపై కిటికీలు కలిగి ఉన్న ఇళ్లకు  పది షిల్లింగ్లు చెల్లించాల్సి వచ్చేది. చాలామంది పన్ను కట్టలేక ఇటుకలతో కిటికీలను మూసేసుకొనేవారు. దాంతో వారికి అనారోగ్య సమస్యలు వచ్చాయి.


రష్యా


1705 లో, రష్యన్ చక్రవర్తి పీటర్ ది గ్రేట్ పశ్చిమ యూరోప్ పురుషులు అందంగా క్లీన్‌గా షేవ్ చేసుకొని అందంగా కనిపించాలనే ఉద్దేశంతో గడ్డలపై పన్ను విధించాడు.