Strawberries for diabetes: షుగర్ వ్యాధి ఉంటే స్ట్రాబెర్రీలు తినవచ్చా? నిపుణులు ఏమన్నారంటే..
Strawberries for diabetes: స్ట్రాబెర్రీస్ రుచిగా తియ్యగా ఉంటాయి. ఇది మంచి స్నాక్ ఐటమ్ మాత్రమే కాదు ఆరోగ్యకరం కూడా. వీటిని స్నాక్, స్మూథీ రూపంలో తీసుకుంటారు. స్ట్రాబెర్రీస్ లో ముఖ్యంగా విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Strawberries for diabetes: స్ట్రాబెర్రీస్ రుచిగా తియ్యగా ఉంటాయి. ఇది మంచి స్నాక్ ఐటమ్ మాత్రమే కాదు ఆరోగ్యకరం కూడా. వీటిని స్నాక్, స్మూథీ రూపంలో తీసుకుంటారు. స్ట్రాబెర్రీస్ లో ముఖ్యంగా విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే డయాబెటిస్ తో బాధపడేవారు స్ట్రాబెరీలు తినవచ్చా న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీస్ తియ్యగా ఉంటాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెరీస్ రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి న్యూట్రియన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ వారు స్ట్రాబెరీస్ ఎలా తింటే మేలో తెలుసుకుందాం.
గ్లైసేమిక్ సూచి తక్కువ..
స్ట్రాబెర్రీల్లో గ్లైసమిక్ సూచి తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరల స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు. గ్లూకోస్ స్థాయిలను నిర్వహిస్తాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు స్ట్రాబెరీస్ తినవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఫైబర్ పుష్కలం..
స్ట్రాబెరీస్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెరను మెల్లిగా గ్రహిస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెరుగు చేస్తుంది. అంతేకాదు స్ట్రాబెరీస్ లో ఉండే ఫైబర్ ఎక్కువ శాతం ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. కాబట్టి డయాబెటిస్ వారు తినవచ్చు.
యాంటీ ఆక్సిడెంట్స్..
కొన్ని వార్తా నివేదికల ప్రకారం డయాబెటిస్ ఉన్నవారికి స్ట్రాబెరీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇన్ఫ్లమేటరీ యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు కూడా ఉండటం వల్ల ఇన్సూలీన్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: ఈ 5 వంటగది వస్తువులతో మీకు నిత్యయవ్వనం ఖయాం..
బరువు నిర్వహణ..
ఒబెసిటీ వల్ల డయాబెటిస్‌తో బాధపడేవారు అయితే స్ట్రాబెర్రీస్ డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. నీటి శాతం అధికంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం..
డయాబెటిస్ తో బాధపడే వారికి గుండె సమస్యలు కూడా వస్తాయి. గుండె ఆరోగ్యం కోసం స్ట్రాబెరీస్ తినండి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. అంతేకాదు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగు చేస్తుంది.
ఇదీ చదవండి: మ్యాంగో పరాఠా ఇలా చేసుకుంటే ఎంతో రుచి.. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..
డయాబెటిస్ తో బాధపడేవారు స్ట్రాబెర్రీలు తినవచ్చా?
డయాబెటీస్‌తో బాధపడేవారు స్టాబెర్రీలను తినవచ్చు. డయాబెటీస్ వారు సమతుల ఆహారంలో చేర్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొద్ది కొద్దిగా ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు ఎందుకంటే స్ట్రాబెరీస్ లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి.
ఒక కప్పు కట్ చేసిన స్ట్రాబెరీస్ లో 11 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంతేకాదు 2.9 గ్రాముల డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి