Tips For Shining Nails: ఈ చిట్కాలతో మీ గోళ్లు అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి
Shining Nails Home Remedies: అందంగా కనిపించడానికి చాలామంది మార్కెట్లో లభించే ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే కొందరు ముఖంపై చూపించే శ్రద్ధ గోళ్లపై ఏ మాత్రం చూపించారు.దీని కారణంగా గోర్లు అందవికారంగా కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనే వారు ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల గోళ్లు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.
Shining Nails Home Remedies: ప్రస్తుతం చాలా మంది గోళ్ల సమస్యతో బాధపడుతుంటారు. గోళ్లు సరిగ్గా పెరగకపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఈ చిట్కాలను పాటించడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా మారుతాయి. అలాగే గోళ్లు పొడవుగా కూడా పెరుగుతాయి. గోళ్లను పెంచుకునేందుకు ఉపయోగపడే చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
✩ ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్ల నిమ్మరసం తగినంత ఆలివ్ నూనె వేయాలి. ఈ రెండిటిని మిక్స్ చేసిన మిశ్రమంలో గోళ్లను ముంచి ఐదు నిమిషాల తర్వతా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు పొడవుగా పెరుగుతాయి.
✩ రోజ్ వాటర్ మహిళల చర్మ సంరక్షణకు మేలు చేయడమే కాకుండా మీ గోర్లును కూడా అందంగా తయారు చేస్తుంది. ప్రతిరోజు రోజ్ వాటర్‌తో గోర్లును మసాజ్ చేయడం వల్ల గోళ్లకు అందంగా కనిపిస్తాయి.
✩ ఆల్మండ్ ఆయిల్‌తో గోళ్లపై రాసి రెండు మూడు నిమిషాలు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మెరిసే గోళ్లు మీ సొంతం చేసుకోవచ్చు.
✩ నిమ్మకాయతొక్కలోని సిట్రిక్ యాసిడ్ గోళ్లను మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని వల్ల గోళ్లపై ఉండే మరకలు తొలగి, సహజమైన మెరుపు లభిస్తుంది.
✩ చేతి గోర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
✩ గోర్లు బలంగా ఉండాలి అంటే ఆరెంజ్ జ్యూస్ తీసుకుని గోర్లను నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గోర్లు బలంగా, అందంగా ఉంటాయి.
✩ కొంతమందిలో తరుచుగా గోళ్లు విరిగిపోతుంటాయి. దీని కోసం గుడ్డు పెంకులు నలగ్గొట్టి పౌడర్ తయారు చేయాలి. దీని నెయిల్ పాలిష్‌లో కలిపి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
Also read: Deep Fried Foods: డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటున్నారా..? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter