Sugarcane Juice Benefits In Summer: వేసవిలో వారంలో 4 రోజులైన చెరకు రసం తాగండి.. ఎందుకంటే..
Sugarcane Juice Benefits In Summer: ఎండా కాలంలో ప్రతి రోజు చెరకు రసం తాగడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి.
Benefits Of Sugarcane Juice In Summer: ఎండా కాలంలో మంది కూల్ డ్రింక్స్‌ను అతిగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల శరీరానికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటికి బదులుగా పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు తాగడం చాలా మంచిది. ముఖ్యంగా వేసవి కాలం రోడ్లపై లభించే చెరకు రసం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఎండకాలంలో ఈ షుగర్ కేన్ జ్యూస్ ప్రతి రోజు తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
ఎండా కాలంలో చెరకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది:
చెరకు రసం 90 శాతం నీరు ఉంటుంది. కాబట్టి దీనిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఎండా కాలంలో చెమట ద్వారా ఎక్కువ నీరు రావడం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. శక్తిని పెంచుతుంది:
చెరకు రసంలో సహజ చక్కెర పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలు అలసట తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
చెరకు రసంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఈ రసాన్ని తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలంగా వస్తున్న పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి.
4. మూత్రపిండాల ఆరోగ్యానికి..:
చెరకు రసం మూత్రపిండాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రాళ్ల సమస్యలతో బాధపడేవారు కూడా ఈ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మూత్రపిండాలపై ఒత్తిడి కూడా తగ్గే ఛాన్స్ ఉంది.
5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
చెరకు రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
6. చర్మ ఆరోగ్యానికి మంచిది:
చెరకు రసం చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రసాన్ని ముడత చర్మం, ఇతర చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తప్పకుండా ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి