Summer Best Facemasks:  సహజ సిద్ధమైన ఫేస్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ కు గురికాకుండా మంచి ఫలితాలను పొందుతారు. ఎండాకాలం కూడా మీరు అలాంటి ఫేస్ మాస్కులు తయారు చేసుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి దీంతో మీ ముఖం సహజసిద్ధంగా కాంతివంతంగా కనిపిస్తుంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగు, నిమ్మకాయ ఫేస్‌ మాస్క్..
పెరుగు నిమ్మకాయ మంచి రుచిని కూరగాయ కూరలకు ఇవ్వడమే కాకుండా ఇవి అందానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పెరుగు నిమ్మకాయతో తయారు చేసిన మాస్క్ ని చర్మాన్ని ఆరోగ్యకరంగా మారుస్తుంది. ఈ రెండిటితో తయారు చేసిన మాస్క్ ముఖంపై పేరుకున్న ట్యాన్, ఎండ వల్ల నల్లగా మారిన చర్మానికి సూర్యరశ్మి నుంచి కూడా రక్షిస్తుంది. ఈ రెండిటితో కలిపి తయారుచేసిన మాస్క్ తో మీ ముఖం ఒక మ్యాజికల్ గ్లో కనిపిస్తుంది.


ఫేస్‌ మాస్క్‌ తయారీ విధానం..
ఒక అరకప్పులో పెరుగు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఈ రెండిటిని బాగా కలుపుకొని మీ ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి 20 నిమిషాలు తర్వాత నీటితో కడిగేసుకుంటే మ్యాజిక్ లో చూస్తారు.


ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్..
మూల్తానిమిట్టితో ముఖంపై మంచి  గ్లో వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే రోజు వాటర్ తో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ స్కిన్ టోన్ గ్లోయింగ్ గా కనిపిస్తుంది. 


ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం..
రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి తీసుకొని అందులో రోజ్ వాటర్ కలుపుకోవాలి. దీన్ని స్మూత్ పేస్ట్ మాదిరి రోజ్ వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ని ముఖాన్ని మెడ భాగంలో అప్లై చేసుకొని ఆరనివ్వాలి. ఈ ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.


శనగపిండి ఫేస్ మాస్క్‌..
శనగ పిండితో కూడా మన ముఖానికి గ్లోయింగ్ వస్తుంది. ఇందులో ఎన్నో గుణాలు ఉంటాయి తరతరాలుగా శనగపిండిని బ్యూటీ ప్రోటీన్ లో ఉపయోగిస్తున్నారు. ఇది చర్మ సంబంధించిన సమస్యల నుంచి రక్షిస్తుంది. ఈ పిండితో ముఖంపై ఉన్న టాన్ క్లియర్ అయిపోయే డేడ్ స్కిన్‌ను తొలగిస్తుంది. అంతేకాదు యాక్నేకు కూడా చెక్‌ పెడుతుంది. రెండు టేబుల్ స్పూన్ శనగపిండిలో పచ్చిపాలు వేసి కలుపుకోవాలి ఇందులో కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు దీనికి కావాల్సినంత నీరు జోడించి పిక్ పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీని ముఖం మెగా భాగంలో అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.


ఇదీ చదవండి: రెస్టారెంట్ స్టైల్‌లో కాకరకాయ వేపుడుని ఇలా తయారు చేసుకోండి..  లొట్టలు వేసుకొని తింటారు


పసుపు ఫేస్ మాస్క్..
అందరి ఇంట్లో కనిపించి ఒక నిత్యవసర వస్తువు. అంతేకాదు పసుపులో స్కిన్ సమస్యలను తొలగించే గుణాలు ఉంటాయి దీంతో తయారు చేసిన ఫేస్ మాస్క్ తో మన చర్మానికి ఆరోగ్యకరమైన సహజసిద్ధమైన గ్లో వస్తుంది. ఒక సగం స్పూన్ పసుపు పొడిని తీసుకుని అందులో బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ రెండిటిని రోజు వాటర్ తో కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇది స్మూత్ పేస్ట్ అయ్యాక ముఖం మెడ భాగంలో అప్లై చేసుకుని ఐదు నిమిషాలు తర్వాత పాటు మసాజ్ చేసుకుంటూ ఉండాలి. మరో ఐదు నిమిషాల తర్వాత ముఖం రుద్దాలి.  ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి మీరు వెంటనే గ్లోయింగ్ స్కిన్ ని చూస్తారు.


ఇదీ చదవండి: బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ ఒక్క జ్యూస్ తాగి చూడండి


ఈ హోం మేడ్ ఫేస్ మాస్కులు మీరు బ్యూటీ రొటీన్ లో యాడ్ చేసుకుంటే సహజసిద్ధంగా గ్లో పొందుతారు అయితే ఏ ఫేస్ మాస్ వేసుకున్న ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి లేకపోతే స్కిన్  సంబంధించిన సమస్యలు వస్తాయి.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter