Summer Skincare Tips: ఎండకాలం వేడిమితో ముఖం డల్ గా మారిపోతుంది. దీనివల్ల ముఖం కూడా టాన్ అవుతుంది ఎండకాలం మీ ముఖం చల్లగా చెమట పట్టకుండా ఫ్రెష్ గా కనిపించాలంటే కొన్ని బెస్ట్ హోమ్ ఫేస్ మాస్కులు ఉన్నాయి ఇవి బ్యూటీ ఎక్స్‌పర్ట్‌ షహనాజ్‌ హుస్సేన్‌  షేర్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగు, కలబంద మాస్క్‌..
ఎండ వేడిమి కి ముఖం టాన్ అయి డల్ గా కనిపిస్తుంది. పెరుగు, కలబంద వేసి కలిపి తయారు చేసుకోవాలి. ఇది ముఖానికి చల్లదనాన్ని ఇచ్చి ఫ్రెష్ గా కనిపించేలా చేస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్స్ పెరుగు, మూడు టేబుల్ స్పూన్ల కలబంద వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ముఖం, మెడ భాగానికి పట్టించి 20 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేసుకోవాలి.


పుదీనా ప్యాక్
పుదీనాలో చల్లదనం ఇచ్చే గుణాలు ఉంటాయి. ఇంకా మూల్తానీ మట్టి ముఖంపై ఉన్న అధిక నూనెను తొలగిస్తుంది. ఈరెండిటిని అప్లై చేసుకోవడం వల్ల ముఖానికి చల్లదనాన్ని అందిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒక టేబుల్ స్పూన్, పుదీనా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని ముఖానికి పేస్ట్ మాదిరి అప్లై చేసుకోవాలి ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.


టమాటా ఫేస్ ప్యాక్..
ఒక మీడియం సైజు టమాటా తీసుకొని దానికి ఒక స్పూన్ తేనె వేసి ముఖానికి మర్దన చేసుకోవాలి 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి . తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి ఇది ముఖంపై యాక్నే రాకుండా కాపాడుతుంది.  టమాటా ముఖంపై పేరుకున్న ట్యాన్ సమర్థవంతంగా తొలగిస్తుంది. ఈ రెండు కలిపి సమ్మర్లో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితాలను చూస్తారు.


ఇదీ చదవండి: ఎండకాలం జుట్టుకు చల్లదనాన్నిచ్చే కూల్‌ హెయిర్‌ మాస్క్స్..


రోజ్ వాటర్, శాండల్ వుడ్..
చందనాన్ని సంవత్సరాలుగా సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. ఇవి కూడా చల్లదనం గుణం కలిగి ఉంటాయి. ముఖానికి మెరుపు తెస్తుంది ఇక రోజ్ వాటర్ ముఖంపై ఉన్న అధిక నూనెను తొలగిస్తుంది. ముఖానికి కావాల్సిన హైడ్రేషన్ ఇస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల చందనంలో రోజ్ వాటర్ వేసి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇది ముఖం మెడ భాగానికి పట్టించిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ముఖం డల్‌గా  ఉన్నవారికి ఇది సమర్థవంతమైన రెమెడీ.


ఇదీ చదవండి:  ఈ 6 కూరగాయల్లో నీరు అధికం.. ఇలా తింటే ఈజీగా బరువు తగ్గిపోతారు..


పుచ్చకాయతో మాస్క్..
పుచ్చకాయలో విటమిన్ ఏ,సి ఉంటుంది. ఇది ముఖాన్ని కాంతివంతం చేసి హైడ్రేషన్ గా ఉంచుతుంది. జిడ్డు చర్మంతో బాధపడే వారికి ఇది బెస్ట్ రెమెడీ పుచ్చకాయ గుజ్జు పెరుగు కలిపి బాగా మిక్స్ చేసుకొని ముఖం ముఖంపై అప్లై చేసుకోవాలి సన్‌ బర్న్ ఉన్న ప్లేస్ లో కూడా అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook