DIY Hair Masks: ఎండకాలం జుట్టుకు చల్లదనాన్నిచ్చే కూల్‌ హెయిర్‌ మాస్క్స్..

DIY Hair Masks: ఎండకాలం విపరీతమైన వేడితో జుట్టు నిర్జీవంగా మారుతుంది. సరైన జీవనశైలితోపాటు జుట్టుకు మంచి హెయిర్‌ మాస్క్‌లు వేసుకుంటే జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆ హెయిర్‌ మాస్క్‌లు ఏంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Apr 19, 2024, 03:58 PM IST
DIY Hair Masks: ఎండకాలం జుట్టుకు చల్లదనాన్నిచ్చే కూల్‌ హెయిర్‌ మాస్క్స్..

DIY Hair Masks: ఎండకాలం విపరీతమైన వేడితో జుట్టు నిర్జీవంగా మారుతుంది. సరైన జీవనశైలితోపాటు జుట్టుకు మంచి హెయిర్‌ మాస్క్‌లు వేసుకుంటే జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆ హెయిర్‌ మాస్క్‌లు ఏంటో తెలుసుకుందాం. అరటిపండు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని చిక్కని పేస్ట్‌ మాదిరి తయారు చేసుకోవాలి. ఇందులో పెరుగు, తేనె వేసి కలపాలి. ఈ మూడిటినీ బాగా కలిపి హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకోవాలి. జుట్టు పార్టులుగా విభజించి ఈ మాస్క్ అప్లై చేసుకోవాలి. జుట్టు అంతటికీ ఈ మాస్క్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు షవర్ క్యాప్ నెత్తికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గంట అలాగే ఉంచి సున్నితమైన షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఈ మాస్క్ వారానికి ఒకసారి అప్లై చేసుకోవాలి.

ఎగ్‌ వైట్‌, ఆలివ్ ఆయిల్..
గుడ్లును పగలుగొట్టి తెల్లని భాగాన్ని మాత్రమే ఓ బౌల్‌ లోకి తీసుకోవాలి. ఇందులో ఆలివ్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇప్పుడు హెయిర్‌ మాస్క్‌ రెడీ అయినట్లే దీన్ని జుట్టంతటికీ పట్టించాలి.జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఓ అరగంట తర్వాత షాంపూ చేసుకోవాలి. ఈ మాస్క్ వారానికి రెండుసార్లు అప్లై చేయాలి. ఇది జుట్టుకు షైన్ ఇచ్చి స్ల్పిట్‌ ఎండ్స్‌కు చెక్‌ పెడుతుంది.

ఇదీ చదవండి: ఈ 6 కూరగాయల్లో నీరు అధికం.. ఇలా తింటే ఈజీగా బరువు తగ్గిపోతారు..

ఈ హెయిర్‌ మాస్క్ వల్ల ప్రయోజనాలు..
ఈ హెయిర్ మాస్క్‌లో కెరటిన్, అమైనో యాసిడ్స్, విటమిన్స్ ఉంటాయి. ఇది జుట్టును బలంగా మారుస్తాయి. స్ల్పిట్‌ ఎండ్స్‌ను తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.

ఈ హెయిర్‌ మాస్క్‌లు వేసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది.  దీంతో పాటు పెప్పర్మెంట్‌ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్, బయోటిన్ వల్ల బ్లడ్‌ సర్క్యూలేషన్‌ పెంచుతుంది. ఇది హెయిర్‌ ఫాలికల్స్‌ను బలపరుస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టుకు ప్రోత్సహిస్తుంది.

ఇదీ చదవండి: కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తే ఇడ్లి, దోశ, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది..

ఈ మాస్క్‌లో కెరటిన్, కొల్లాజెన్ జుట్టు కుదుళ్లను మెరుగుచేస్తుంది. జుట్టు డ్యామేజ్‌ అవ్వకుండా ఉంటుంది. పొడి, డ్యామేజ్ జుట్టు ఫ్రీజీగా మారకుండా ఉంటుంది. ఈ మాస్క్‌లు జుట్టుకు హైడ్రేషన్‌ ఇస్తుంది. అంతేకాదు జుట్టును స్మూత్‌గా మారుస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News