Facial Glow In Monsoon: మారుతున్న సీజన్లో ఫేషియల్ గ్లో పొందడానికి నిపుణులు సూచించిన 5 టిప్స్..
Facial Glow In Monsoon: వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ముఖం పై కూడా సరైన స్కిన్ కేర్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీ చర్మం సున్నితంగా మారుతుంది.
Facial Glow In Monsoon: వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ముఖం పై కూడా సరైన స్కిన్ కేర్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీ చర్మం సున్నితంగా మారుతుంది. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల కారణంగా ఇలా జరుగుతుంది. దీనివల్ల ముఖం డల్‌గా కూడా కనిపిస్తుంది. అయితే, ఈ సమయంలో స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం.
క్లెన్సింగ్..
వర్షాకాలంలో ముఖం నిర్జీవంగా మారుతుంది. ఇది వాతావరణంలో మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. ముఖంపై ఓపెన్ పోర్స్ సమస్య కూడా మొదలవుతుంది. అందుకే ఈ సీజన్‌లో కూడా ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ఫేస్‌వాష్ చేసుకోవాలి. ముఖ్యంగా సహజసిద్ధమైన ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలి. దీంతో ముఖం క్లీయర్‌గా కనిపిస్తుంది. వేప, టీ ట్రీ ఆయిల్ వంటివి యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంటాయి.
ఎక్స్‌ఫోలియేట్..
ఈ సీజన్లో స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖానికి సున్నితంగా స్క్రబ్ కూడా చేసుకోవాలి. ఇది వారానికి ఒకసారి చేసుకోవాలి. ఓట్మీల్‌తో ఇంట్లోనే స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి ఓట్మీల్, యోగర్ట్, శనగపిండి, పాలు కూడా వేసి ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: జుట్టు ఊడిపోయి సన్నగా మారిపోతుందా? ఈ ఒక్క చిట్కాతో ఊడిన వెంట్రుకలు కూడా మళ్లీ పెరుగుతాయి..
అదనపు నూనె..
ఈ సమయంలో ముఖం జిడ్డుగా మారుతుంది. సెబం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో ముఖం మరింత జిడ్డుగా మారిపోతుంది. స్కిన్‌పై యాక్నే కూడా పేరుకుంటుంది. చార్కోల్, రైస్ స్టార్చ్, కార్న్ స్టార్చ్, శనగపిండితో ముఖంపై మాస్కులు వేసుకోవాలి. ముల్తానీ మిట్టితో కూడా ఫేస్ మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు.
మాయిశ్చర్..
ముఖాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ముఖంపై పేరుకున్న ఆయిల్‌ని తొలగిస్తుంది. కలబంద, విటమిన్ ఇ, గ్లిజరిన్, దోసకాయ మృదువుగా మారుతుంది. ఇది మాయిశ్చర్‌గా మారుతుంది. సమతుల్య ఆహారం డైట్లో చేర్చుకోండి.
ఇదీ చదవండి: తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? ఈ ఒక్క జ్యూస్‌తో శాశ్వతంగా నల్లగా మారిపోతుంది..
సన్‌స్క్రీన్..
సూర్యుని హానికర కిరణాల నుంచి రక్షణ పొందడానికి సన్‌స్క్రీన్ ఉపయోగిస్తాం. ఇది స్కిన్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. సన్‌స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 30 మన చర్మానికి రక్షణ అందిస్తుంది. అయితే, మారుతున్న సీజన్లో కూడా సన్‌స్క్రీన్ పెట్టుకోవాలి. రోజుకు కనీసం రెండుసార్లైనా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి