White Hair Remedy: ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. 18 వయస్సులో కూడా తెల్ల జుట్టు వస్తుంది. అయితే కొన్ని ఆహారాలు డైట్ లో చేర్చుకోవడంలో తెల్ల జుట్టును శాశ్వతంగా నివారించవచ్చు. ఇవి మనకు ఈజీగా అందుబాటులో ఉంటాయి. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
పాలకూర..
పాలకూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఐరన్ లేమితో బాధపడే వారికి పాలకూర ఎఫెక్టీవ్ రెమిడీ. అంతేకాదు పాలకూర జుట్టును తెల్ల పడకుండా కాపాడుతుంది.
క్యారట్స్..
క్యారట్లలో బీటా కెరటిన్ ఉంటుంది. ఇది విటమిన్ ఏ రూపంలోకి మారుతుంది. విటమిన్ ఏ సెబం ఉత్పత్తిని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కుదుళ్ల నుంచి ఆరోగ్యవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు జుట్ టుకుదుళ్లు పొడి బారకుండా జుట్టు తెల్ల వెంట్రుకలు రాకుండా నివారిస్తుంది.
బీట్‌రూట్..
బీట్‌రూట్‌లో కూడా యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. జుట్టును ఆరోగ్యంగా పెంచేలా చేస్తుంది. అంతేకాదు బీట్‌రూట్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. దీంతో తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోతుంది.
ఉసిరి..
ఉసిరిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్ ఆయుర్వేదిక్ మందుల్లో కూడా విపరీతంగా ఉసిరిని వాడుతారు. జుట్టుని శాశ్వతంగా తెల్లబడకుండా కాపాడే గుణాలు ఉసిరిలో ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించకుండా కాపాడుతుంది. తెల్ల వెంట్రుకల సమస్యను తగ్గిస్తుంది ఇది సహజసిద్ధంగా పిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెడుతుంది.
ఇదీ చదవండి: పసుపుతో తయారు చేసే ఈ మాస్క్ ముఖానికి మచ్చలు లేకుండా గోల్డెన్ గ్లో ఇస్తుంది..
అల్లం..
అల్లం లాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది. అల్లం రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది.
నిమ్మరసం..
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. నిమ్మరసం కొబ్బరి నూనె కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు నిమ్మరసం డాండ్రఫ్ సమస్యకు చెక్ పెడుతుంది. ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ సమస్యకు ఎఫెక్టీవ్ రెమిడీగా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: జుట్టు ఊడిపోయి సన్నగా మారిపోతుందా? ఈ ఒక్క చిట్కాతో ఊడిన వెంట్రుకలు కూడా మళ్లీ పెరుగుతాయి..
పుదీనా
పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్సు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నివారిస్తుంది తెల్ల వెంట్రుకలు రాకుండా చెక్ పెడుతుంది.
కొబ్బరినీరు
కొబ్బరి నీటిలో హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో ఎలక్ట్రోలైట్స్ జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతాయి. జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. వీటన్నిటినీ జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా వీటిని బ్లెండ్ చేసి తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి