Tamarind Seeds Benefits: మంగు మచ్చలు అనేవి మహిళల్లో అలాగే పురుషుల్లో కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల ఎలాంటి నష్టం లేనప్పటికీ ముఖం చూడడానికి అంద‌విహీనంగా క‌నిపిస్తుంది. సాధారణంగా చర్మం కింద  పొర‌ల్లో మెల‌నోసైట్స్ ఉంటాయి. ఇవి మెల‌నిన్ అనే న‌లుపు ని విడుదల చేస్తుంది. మెల‌నిన్ ను ఉత్ప‌త్తి చేసే మెల‌నోసైట్స్ నుంచి థైరోసోనైస్ అనే ఎంజైమ్ ఉత్ప‌త్తి అవుతుంది. ఈ ఎంజైమ్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల న‌లుపు వ‌ర్ణం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న‌లుపు వ‌ర్ణం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల చ‌ర్మంపై మంగు మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కోసం మంగు మచ్చల సమస్యతో బాధపడేవారు మార్కెట్‌ లో లభించే మందులను ఉపయోగిచే అవసరం లేదు. మన ఇంట్లో ప్రతి రోజు వంటకాల్లో వాడే చింత పండు ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.  చింతపండు గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఔష‌ధ గుణాలు సమస్యను తగ్గిస్తుంది. 


వీటిని వాడ‌డం వ‌ల్ల మంగు మ‌చ్చలు పోతాయ‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా తేలింది. చింత‌గింజ‌ల‌ను  పొడిగా చేసుకోవాలి. ఇందులో తేనెను క‌లిపి మంగు మ‌చ్చ‌ల‌పై రాయాలి. ఇలా రాయ‌డం వ‌ల్ల మెల‌నోసైట్స్ లో ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యే థైరోసోనైస్ ఎంజైమ్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది. దీంతో మెల‌నిన్ ఉత్ప‌త్తి త‌గ్గి మంగు మచ్చ‌లు త‌గ్గుతాయని చర్మ నిపుణులు చెబుతున్నారు.


చింత‌గింజ‌ల‌ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ క‌ణాల‌లో వ‌చ్చిన ఇన్ ప్లామేష‌న్‌, మచ్చలు త‌గ్గుతాయి.  2012లో థాయిలాండ్ దేశ శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో చింతగింజలు మంగు మచ్చల పై ప్రభావం చూపుతాయని ఆరోగ్యనిపుణులు తెలిపారు. 


మంగు మ‌చ్చ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఎండ‌లో తిరగ‌కుండా ఉండ‌డం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎక్కువ సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ మీరు ఎండలో బయటకు వెళ్లి అంటే కొన్ని జాగ్రతలను తీసుకోవాలి. 


Also Read  Sunlight: రోజు ఉదయం ఇలా 5 నిమిషాలు ఎండలో కూర్చుంటే మానసిక సమస్యలన్నీ చెక్‌!


మంగు మచ్చలతో బాధపడేవారు బంగాళ దుంపల గుడ్డలో వేసి రసం వచ్చేలా పిండుకోవాలి. దూదిని ఆ రసంలో ముంచి మచ్చలపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి.


ముఖంపై ఉండే మచ్చలను తగ్గించడంలో టమోటా  ఎంతగానో పనిచేస్తుంది. టమోటా గుజ్జును మచ్చలపై రాసుకునితర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకాలి అలా చేయడం వల్ల మచ్చలు తగ్గుతాయి. 


కలబంద  ఉంటే మచ్చలపై  రయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలుగుతాయి. ఈ విధంగా మచ్చలను తొలగించుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also Read  Biryani Leaves: మూత్ర సమస్యలకు చెక్ పెట్టడంలో బిర్యానీ ఆకు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter