Aloe Vera Juice Empty Stomach Benefits: అలోవెరా ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన మొక్క. దీనిని ఎక్కువగా చర్మ సంరక్షణ కోసం, ఫేస్‌ క్రీమ్‌లలో ఉపయోగిస్తారు.  అయితే అలోవెరా జ్యూస్‌ గురించి మీరు విన్నారా..? అలోవెరా జ్యూస్‌ పరగడుపున తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలోవెరా జ్యూస్‌ ఖాళీ కడుపుతో తాగడం వల్ల కలిగే ఆరోగ్యాలాభాలు: 


అలోవెరా జ్యూస్‌ను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడే ఎంజైములను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అలోవెరాలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాస్‌ అలోవెరా జ్యూస్‌ తీసుకోవడం వల్ల  శరీరంలోని వ్యర్థాలు తొలుగుతాయి. సులువుగా బరువు తగ్గవచ్చు. 


చర్మ సమస్యలకు అలోవెరా జ్యూస్‌ చక్కటి మందు. దీనిని ఉపయోగించడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. మొటిమలు, మంట తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి ఎంతో సహాయపడుతాయి. అలోవెరా జ్యూస్‌ లో విటమిన్, మినరల్స్‌ ఉంటాయి. అంతేకాకుండా ఇది తక్కువ కేలరీలు కలిగిన ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. 


డయాబెటిస్‌ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా ఈ అలోవెరా జ్యూస్‌ను తీసుకోవచ్చు. రక్తంలోని గ్లూకోజ్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. అయితే ఇందులో ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల ప్రీ డయాబెటిక్‌ వారు మితంగా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. 


కంటి చూపు సమస్యలకు కూడా అలోవెరా జ్యూస్‌ మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్‌ ఎ,సి, ఇ, బి గుణాలు కంటి చూపు బాగా కనిపించేలా చేస్తుంది. దంత ఆరోగ్యానికి కూడా ఈ అలోవెరా జ్యూస్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది బ్యాక్టీరియాలో పోరాడటానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే  మౌత్ వాష్‌గా కూడా పనిచేస్తుంది.  అలోవెరా జ్యూస్‌ సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలోని వ్యర్థ  పదార్థాలు బయటకు తొలగించడంలో మేలు చేస్తుంది.  


దుష్ప్రభావాలు:


డయేరియా: కొంతమందిలో, అలోవెరా జ్యూస్‌ డయేరియాకు కారణమవుతుంది, ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు.


అలెర్జీ: కొంతమందికి అలోవెరా జ్యూస్‌ కి అలెర్జీ ఉండవచ్చు, దీని వల్ల దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కలుగుతాయి.


గర్భవతి లేదా పాలిచ్చే మహిళలు అలోవెరా జ్యూస్‌  తాగకూడదు.మీరు ఏదైనా మందులు వాడుతుంటే,అలోవెరా జ్యూస్‌  తీసుకోవడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.


ముగింపు:


ఖాళీ కడుపుతో ఉదయం అలోవెరా జ్యూస్‌  తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  అయితే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కలబంద రసం తీసుకోవడానికి ముందు మీ వైద్యుడితో మాట్లాడటం ముఖ్యం, ముఖ్యంగా మీకు ఏవైనా ఆరోగ్య పరిస్థితులు ఉంటే లేదా మందులు వాడుతుంటే.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి